Breaking News

భవిష్యత్తు తరాలకు భరోసా సీఎం జగన్

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-30 వ డివిజన్ 251 వ సచివాలయ పరిధిలో ఐదో రోజు గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్షేమ పాలకుడిగా పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు తరాలకు భరోసాగా నిలబడుతున్నారని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 30 వ డివిజన్ 251 వ వార్డు సచివాలయ పరిధిలో సోమవారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. దావుబుచ్చయ్య కాలనీలో విస్తృతంగా పర్యటించి.. 232 గడపలను సందర్శించారు. సామాన్య, పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల అవసరాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. శాచ్యురేషన్ విధానం ద్వారా అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందించడంలో తాము సఫలీకృతం అయినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజాభిప్రాయాలను సేకరించారు. ప్రధానంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, సచివాలయ వ్యవస్థపై ప్రజలల్లో స్పందని బాగుందని పేర్కొన్నారు. తాము అడుగుతున్న ప్రశ్నలకు, ప్రజలు ఇస్తున్న సమాధానాల్లో జగనన్న ప్రభుత్వంపై వారికి పెరిగిన సంపూర్ణ విశ్వాసం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు సుధీర్ఘ అనుభవం చివరకు మోకరిల్లింది
ప్రతిపక్ష నేత చంద్రబాబుకు 2024 ఎన్నికల భయం పట్టుకుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభంజనాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక తెగ తర్జనభర్జన పడుతున్నారని విమర్శించారు. చివరకు బాబు సుధీర్ఘ అనుభవం.. పవన్ కళ్యాణ్ ముందు మోకరిల్లిందని ఎద్దేవా చేశారు. నారా లోకేష్ యువగళం ముగింపు కార్యక్రమానికి రాలేనని పవన్ తేల్చి చెప్పడంతో.. ఆఘమేఘాల మీద చంద్రబాబు వెళ్లి పవన్ ను కలిశారన్నారు. పైకి అభ్యర్థుల ఎంపిక, ఉమ్మడి కార్యాచరణ అని కబుర్లు చెబుతున్నా.. వెనుక ఉన్న ఆంతర్యాన్ని ప్రజలు ఏనాడో గ్రహించారన్నారు. పదేపదే తెలుగు వారి ఆత్మగౌరవం కోసమని మాట్లాడే చంద్రబాబు.. జనసేనను ప్రాధేయపడటం విడ్డూరంగా ఉందన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఎవరు ఎవరితో కలిసినా ప్రజల ఆదరాభిమానాలు సీఎం జగన్ పైన మెండుగా ఉన్నాయని.. 175 స్థానాలలో వైసీపీ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు మార్తి చంద్రమౌళి, అక్బర్, పవన్ కుమార్ రెడ్డి, తుంపాల వరప్రసాద్, నారాయణ రెడ్డి, డి.దుర్గారావు, ఎస్.రామకృష్ణ, డి.కృష్ణ, నగర ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే నెం.1గా ఎపి విద్యావ్యవస్థ!

-క్లాస్ రూం నుంచే సమాజంలో మార్పు సాధ్యం…అందుకే విద్యాశాఖ ఎంచుకున్నా -సాంకేతికతకు భారతీయ విలువలు జోడించి ప్రపంచ విజేతలుగా ఎదుగుదాం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *