Breaking News

ప్రజల వద్దకే పాలనను చేరువ చేసిన వైసీపీ ప్రభుత్వం : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో అధికారంలో వచ్చిన నాటి నుండి సచివాలయ, వలంటీర్ వ్యవస్థ లను ప్రవేశపెట్టి ప్రజల వద్దకే పాలనను చేరువ చేసిన ఘనత వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం దే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శుక్రవారం 8వ డివిజన్ 63వ సచివాలయ మరియు 20వ డివిజన్ 101 సచివాలయ పరిధిలో జరిగిన వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆయా సచివాలయాల పరిధిలో అందించిన సంక్షేమ లబ్ది వివరాల డిస్ ప్లై బోర్డును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వం మాదిరిగా దళారులు లేకుండా, జన్మభూమి కమిటీల సిఫార్సు లు లేకుండా అర్హత ఉంటే నేరుగా ఇంటి వద్దకే సంక్షేమ లబ్ది అందిస్తున్నామని అన్నారు. ఈ 63వ సచివాలయ పరిధిలో 2463 మంది లబ్ధిదారులకు 9కోట్ల 76 లక్షల రూపాయలు, 101 సచివాలయ పరిధిలో 4257 మందికి 11కోట్ల 95 లక్షల రూపాయల లబ్ది అందించడం జరిగిందని అన్నారు. 20వ డివిజన్ ప్రాంతావాసుల చిరకాల కోరిక రిటైనింగ్ వాల్ పూర్తి చేసి వరద ముంపునకు శాశ్వత పరిష్కారం చూపించిన గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అని కొనియాడారు. ప్రజలలో ప్రభుత్వానికి రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకే ప్రతిపక్ష టీడీపీ, దాని తోక పార్టీలు, అనుకూల మీడియా అనికూడా కట్టకట్టుకొని ప్రభుత్వం మీద బురద జల్లుడు రాజకీయాలు, చిల్లర చేష్టలు చేస్తున్నాయని విమర్శించారు. ఆఖరికి నిన్న విద్యార్థులకు నైపుణ్యలు మెరుగుపరచడానికి ఇచ్చిన ట్యాబ్ ల విషయంలో కూడా చిల్లర రాతలు రాయడం సిగ్గుచేటు అని అన్నారు. కాబట్టి ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించి మంచి చేస్తున్న ప్రభుత్వానికి, జగనన్న కు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,8వ డివిజన్ ఇంచార్జ్ యలమంచిలి జయ ప్రకాష్,రాష్ట్ర డాక్టర్ సెల్ ఉపాధ్యక్షులు మెహబూబ్,మండల అధ్యక్షులు బుర్రి జగజ్జివన్ రామ్,క్లస్టర్ ఇంచార్జిలు ఉదయ్,రామకృష్ణ,వైసీపీ నాయకులు సురేష్,Nsu రాజు,రఫీ,శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే నెం.1గా ఎపి విద్యావ్యవస్థ!

-క్లాస్ రూం నుంచే సమాజంలో మార్పు సాధ్యం…అందుకే విద్యాశాఖ ఎంచుకున్నా -సాంకేతికతకు భారతీయ విలువలు జోడించి ప్రపంచ విజేతలుగా ఎదుగుదాం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *