-కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఈనెల 19 వ తేదీ శుక్రవారం నుంచి నిర్వహించే కుల గణన సర్వే కు సంబంధించిన ముందస్తు కార్యాచరణ ప్రణాళిక తో అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. కే మాధవీలత అధికారులు సూచించారు.
బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సామాజిక సమత సంకల్పం, ఆడుదాం ఆంధ్ర, కులగణన సర్వే ఇతర అభివృద్ధి అంశాలపై జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ తో కలిసి అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కుల గణన సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో సంబంధిత విధులు నిర్వహించే అధికారులు సిబ్బంది ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో డోర్ టు డోర్ వివరాలు సేకరించే విధంగా సిద్ధమవ్వాలి అన్నారు. జనవరి 19 శుక్రవారం నుంచి క్షేత్ర స్థాయిలో కులగణన చేపట్టవలసి ఉందని, ఇందుకు అవసరమైన మార్గదర్శకాలు జారీ చేశామన్నారు.
ఈనెల 19వ తేదీ విజయవాడ పిడబ్ల్యుడి గ్రౌండ్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణ జరుగునున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా విధులను నిర్వహించా లన్నారు. సామాజిక సమత సంకల్ప కార్యక్రమంలో భాగంగా ఈ నెల 18వ తేదీన కలెక్టరేట్ న్యాక్ సెంటర్ నందు నిర్వహించే రక్తదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఈనెల 20వ తేదీతో ఆడుదాం ఆంధ్ర క్రీడలలో భాగంగా మండల స్థాయి క్రీడలు పూర్తవుతాయన్నారు. ఈనెల 24వ తేదీ నుంచి నిర్వహించనున్న నియోజకవర్గస్థాయి ఆడుదామా ఆంధ్ర క్రీడలకు సంబంధించి సంబంధిత అధికారులు గ్రౌండ్స్, క్రీడా బృందాలు, వారికి కావలసిన ఆట సామాగ్రి, ఇతర అంశాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి అందచేది, క్రీడలను విజయం చేయాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, డి ఆర్ వో జి.నరసింహులు, సిపిఓఎల్ అప్పులకొండ, డీఈవో ఎస్ అబ్రహం, ఆర్డిఓ ఏ చై త్ర వర్షిని, డి ఎల్ డి ఓ ఎల్ వీణా దేవి, జె.సత్యనారాయణ వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News