న్యాయ విజ్ఞాన సదస్సు

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త :
బుధవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా “గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టం, 1994″ (PC & PNDT Act, 1994) ” న్యాయ సేవలు మరియు వారి సంరక్షణ పథకం, 2015″ పై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రత్యూష కుమారి గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టం, 1994 లో చెప్పబడిన నిబంధనల గురించి అవగాహన కల్పించారు. స్కానింగ్ పరీక్షలు నిర్వహించే ప్రతీ కేంద్రం రిజిస్ట్రేషన్ చేయబడి ఉండాలని, రిజిస్ట్రేషన్ లేకుండా పరీక్షలు జరిపే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని అన్నారు. వైద్య సిబ్బంది కానీ పరీక్షలు నిర్వహించువారు కానీ ఆయా కేంద్రాలలో గర్భస్థ శిశువు యొక్క లింగాన్ని మాటలు, సైగలు, చిత్రాపటాలు ద్వారా కానీ మరే విధంగా కానీ తెలియజేయరాదని, గర్భిణీ స్త్రీలు మరియు వారి గర్భంలోని శిశువు ఆరోగ్య పరిస్థితులను తెలుసుకొనేందుకు మాత్రమే ఈ పరీక్షలు నిర్వహించాలని తెలిపారు.

ఎలాంటి మాధ్యమాల ద్వారా అయిన లింగ నిర్ధారణకు సంబంధించిన ప్రకటనలు చేస్తే 3 ఏళ్ల జైలు శిక్ష మరియు పది వేల రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. రికార్డులు, రిజిస్టర్లు, రిపోర్టులు ఇతర సంబంధిత పత్రాలు భద్రపరచాలని అన్నారు. అంగన్వాడి కార్యకర్తలు, ఏ. ఎన్. ఎం లు ప్రత్యేక చొరవ తీసుకుని సామాన్యులకు ఈ విషయాల పట్ల అవగాహన కల్పించాలన్నారు. ఎలాంటి న్యాయ సందేహాలు, న్యాయ సమస్యలు ఉన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని అన్నారు.

జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి కె. విజయకుమారి మాట్లాడుతూ లింగ నిర్ధారణ వల్ల జనాభాలో సమతుల్యత లోపిస్తుందని, అది సమాజానికి ప్రమాదకరమని అన్నారు. గర్భిణీ స్త్రీలు పౌష్టిక ఆహారం తీసుకోవడం, సరైన ఆరోగ్య నియమాలను పాటించడం వల్ల ఆరోగ్యవంతమైన బిడ్డలు కలుగుతారని అన్నారు. ఇందు కోసం క్షేత్ర స్థాయిలో పని చేసే వారు కృషి చేయాలన్నారు.

ఈ సదస్సులో డి.ఐ.ఓ. డా. ఎన్. రాజకుమారి, డిప్యూటీ డి.ఎం. హెచ్.ఓ. డా. ఎం.శ్రీహరి బాబు, వివిధ ఎన్.జీ.వో సంస్థలు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *