“యువతను పునరుద్ధరించడం” పాన్ ఇండియా కార్యక్రమం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ప్రవేశ పెట్టిన “యువతను పునరుద్ధరించడం” పాన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఆదివారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి. కె. ప్రత్యూష కుమారు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాన్ని సందర్శించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా కారాగారంలోని ఖైదీలతో మాట్లాడారు. వారిలో నేరం జరిగిన సమయానికి 18 సంవత్సరారుల వయస్సు దాటని వారిని (చట్టంతో విబేధించిన బాల, బాలికలను) గుర్తించి, వారు తమ వయస్సును ఋజువు చేసుకొనేందుకు సంబంధిత న్యాయస్థానాలలో అర్జీ వేసుకొనేందుకు మరియు ఈ విషయంలో అవసరమైన న్యాయ సహాయం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. వారిలో ఎవరైనా ఇలాంటి వారు ఉన్నట్లైతే డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులు లేదా కారాగారంలోని పారా లీగల్ వాలంటీర్ల ద్వారా వారి వివరాలను జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు అందించాలన్నారు.

రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం, ప్రత్యేక మహిళా కారాగారం మరియు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఉప కారాగారాలలో ఇకపై చట్టంతో విబేధించిన బాల బాలికలు ఒక్కరు కూడా ఉండ కూడదని అన్నారు. ఖైదీలను నిర్బంధం లోకి తీసుకుంటునప్పుడే వారు బాలరు/బాలికలు అని అనుమానం కలిగితే వారి వివరాలు వెంటనే జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు అందించాలని కారాగారంలోని అధికారులకు, పారా లీగల్ వాలంటీర్లకు తెలియ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *