బ్యారేజ్ రహదారి పనులు మరమ్మత్తుల నిమిత్తం మరో 5 రోజులు మూసివేత

-క్యురింగ్ పనుల నిమిత్తం ఇరిగేషన్ అధికారులు విజ్ఞప్తి మేరకు నిర్ణయం
-మరమ్మత్తుల అనంతరం యధావిధిగా ట్రాఫిక్ కి అనుమతి
-కలెక్టర్ మాధవీలత

ధవళేశ్వరం, నేటి పత్రిక ప్రజావార్త :
బ్యారేజ్ మరమ్మత్తు పనుల కోసం ఫిబ్రవరి 10 వరకూ ట్రాఫిక్ మళ్లింపు ఉత్తర్వులను ఫిబ్రవరి 15 వ తేదీ వరకు పొడింగించడం జరిగిందనీ, ఆ మేరకు ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి సహకరించాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత శనివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు.

ధవళేశ్వరం బ్యారేజ్ పై రూ . 2 కోట్ల ల ప్రతిపాదనలతో జరుగుతున్న పనులు ప్రస్తుతం కాంక్రీట్ క్యూరింగ్ పనుల నేపథ్యంలో మరో ఐదు రోజులు ట్రాఫిక్ మళ్లింపు కోసం ఇరిగేషన్ రివర్ కన్సర్వేటివ్ ఈఈ వి. కాశీ విశ్వేశ్వర రావు విజ్ఞప్తి మేరకు బ్యారేజ్ పై రహదారుల మరమ్మత్తు పనుల కోసం మరో ఐదు రోజులు ట్రాఫిక్ మళ్లించ నున్నట్లు తెలిపారు.

పోలీస్ అధికారుల ద్వారా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు , ఈ రహదారి నుండి ప్రయాణించే స్కూల్ బస్సుల యజమాన్యాలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా బస్సులు నడపాలని సంభందిత అధికారుల ద్వారా సమాచారం తెలియ చెయ్యడం జరిగిం దన్నారు. కావున ప్రస్తుతం మరమ్మత్తు పనుల కీలక దశలో ఉన్నదృష్ట్యా ప్రజలు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *