Breaking News

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత

-ఏ ఒక్క బాల్య వివాహం కూడా జరగరాదు : జిల్లా కలెక్టర్
-పర్యావరణ హితంగా ప్లాస్టిక్ రహిత బ్రహ్మోత్సవాలు నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ డా జి. లక్ష్మీ శ
-అన్నదానంలో భక్తులతో పాటు భోజనం చేసిన కలెక్టర్ డా.జి.లక్ష్మీ శ
-బ్రహ్మోత్సవంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు: జిల్లా ఎస్.పి మలిక గర్గ్.
-బ్రహ్మోత్సవాల విజయవంతానికి సమన్వయంతో కృషి చేద్దాం..ఆలయ చైర్మన్

శ్రీకాళహస్తి, నేటి పత్రిక ప్రజావార్త :
సామాన్య భక్తులకు ప్రాధాన్యతగా, మహాశివరాత్రి, రథోత్సవం, కళ్యాణం , గిరి ప్రదక్షిణ రోజుల్లో భక్తులు అధికంగా రానున్న సందర్భంగా ఏర్పాట్లు పకడ్బందీగా వుండాలని, పర్యావరణ హితంగా ప్లాస్టిక్ రహిత బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీ శ పేర్కొన్నారు. దేవస్థానం పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాలని, బ్రహ్మోత్సవాలలో వివిధ అవసరాలను వివరించి అధికారులకు ప్రత్యేక సూచనలు ఇవ్వాలని కలెక్టర్ ను కోరారు. ఆలయ స్వామినాథ్ గురుకుల్ ఆలయ సాంప్రదాయాలను వివరించారు.

గురువారం ఉదయం స్థానిక శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలోని త్రినేత్ర అతిథి గృహములో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు – 2024 నిర్వహణపై వివిధ శాఖల సమన్వయ సమావేశంలో జిల్లా కలెక్టర్ , ఎస్.పి మలిక గర్గ్, వారు ఆలయ చైర్మన్, ట్రైనీ ఎస్పీ పాటిల్ దేవ్ రాజ్ మనీష్, కార్యనిర్వహణ అధికారి నాగేశ్వర్ రావు ,ఆర్డీఓ శ్రీకాళహస్తి రవిశంకర్ రెడ్డి, పాలక మండలి సభ్యులతో కలసి జిల్లా అధికారులతో సమీక్షించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మన భారతీయ సంస్కృతిలో బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఎంతో ప్రాధాన్యత ఉందని, మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు – 2024 ను పకడ్బందీగా సమన్వయంతో నిర్వహించాలని, సాధారణ భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, గత బ్రహ్మోత్సవాల అనుభవాలను, ఎదుర్కొన్న ఇబ్బందులు గుర్తించి వాటిని అధిగమించి ఘనంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. మునిసిపల్ శాఖ వారు సమన్వయంతో పూర్తిస్థాయిలో నగరం, ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, త్రాగునీరు , దోమల నివారణకు ఫాగింగ్ చేపట్టాలని అన్నారు. పోలీస్ శాఖ ఎలాంటి చిన్నపాటి సంఘటనలు జరుగకుండా బందోబస్తు ఏర్పాటు, భక్తులకు భద్రత , పార్కింగ్, వాహనాల మళ్లింపు వంటివి చూడాలని అన్నారు. ప్రతి చోటా సూచిక బోర్డులు ఏర్పాటు చేయగలిగితే భక్తులకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది. అన్నదానం వంటివి సూచించిన ప్రదేశాల్లో మాత్రమే ఏర్పాటు కావాలని అన్నారు. రెవెన్యూ యంత్రాంగం ప్రోటోకాల్ , పోలీస్ తదితర సంబంధిత శాఖల సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలి అన్నారు. బాల్య వివాహాలు జరగకుండా ఐసిడిఎస్, పోలీస్ ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు.లింగోద్భవం మహాశివరాత్రి కి ప్రత్యేక బందోబస్తు, భద్రత ముఖ్యమని అన్నారు. మెడికల్ క్యాంపు లు, 108 అందుబాటులో వుండాలని అన్నారు. ఆర్టిసి బస్సులు భక్తుల సౌకర్యం సరిపడా ఉండాలి, వాహనాల ఫిట్ నెస్ సర్టిఫికెట్ వుండాలి, విద్యుత్ అంతరాయం కలగరాదు అన్నారు. కమాండ్ కంట్రోల్ లో అన్ని శాఖల అధికారులు వుండాలని అందిన సమాచారానికి సత్వరమే స్పందించి వెంటనే పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అన్నారు. ఫైర్ అధికారులు దేవాలయంలో అన్ని పరికరాలు సర్టిఫై చేయాలి అన్నారు. సెల్ ఫోను సిగ్నల్ లు సరిపడా ఉండేలా సంబంధిత నెట్వర్క్ ల స్ట్రెంత్ పెంచేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ఎకో ఫ్రెండ్లీ (పర్యావరణ హితం) పండుగ గా బ్రహ్మోత్సవాలు జరగాలి అని, ప్లాస్టిక్ వాడకం ఉండరాదు అని, ఫ్లెక్సీలు నియంత్రించాలని, ప్లాస్టిక్ పై అధికారులు ఎన్ఫోర్స్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందుకొరకు అన్ని వర్గాల వారు సహకరించాలి అని కోరారు. స్వీప్ ఓటర్ అవేర్నెస్ స్టాల్, దిశా స్టాల్, ఆరోగ్యశ్రీ కౌంటర్, మాతా శిశు సంరక్షణ సలహా కేంద్రం తదితరములు ఉండాలని సూచించారు. ఆర్టీసీ బస్సుల్లో వైద్య సిబ్బందికి సంబంధించిన ఒక ఎఎన్ఎం మందులు, ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచుకోవాలి అని తెలిపారు.

జిల్లా ఎస్పి మాట్లాడుతూ నిర్దేశించిన ప్రదేశాల్లో వాహనాల పార్కింగ్ జరగాలి , ఆలయ సిబ్బంది, అధికారులకు గుర్తింపు కార్డులు లేదా పాస్ వుండాలి, లేకుంటే అనుమతి వుండదు అని అన్నారు. కమాండ్ కంట్రోల్, అవసరమైన చోటల్లా సి.సి కెమెరాలు ఏర్పాటు ఉండాలని అన్నారు. స్విమ్మర్స్ అవసరం ఉంటుందని తెలిపారు.

సమావేశ అనంతరం కలెక్టర్ శ్రీ కాళహస్తీశ్వర స్వామి, జ్ఞాన ప్రసూనాంబ దేవి ని దర్శించుకుని, ఆలయ ప్రాంగణంలో క్యూ లైన్లు తదితరాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం అన్నదానంలో చైర్మన్, ఈఓ తదితరులతో, భక్తులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు.

ఈ సమన్వయ సమావేశంలో పాలకమండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, పోలీస్ అధికారులు అదనపు ఎస్పీ లు రాజేంద్ర, కుల శేఖర్, విమల కుమారి, డిఎస్పీ ఉమా మహేశ్వర రెడ్డి, జిల్లా అధికారులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *