-వైయస్సార్ ఆరోగ్య కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే
-గజ మాలలు,పూల వర్షంతో ఎమ్మెల్యే నానికు ఘన స్వాగతం పలికిన వైఎస్ఆర్సిపి శ్రేణులు….జై కొడాలి నాని నినాదాలతో మార్మోగిన తమిరిశ
-ఆరోగ్యశ్రీతో రాష్ట్రంలోని 95శాతం ప్రజలకు ఆరోగ్య భద్రత…
-దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రతీ పేదవాడికి ఖరీదైన వైద్యం అందిస్తున్న ఘనత సీఎం జగన్ దే…
నందివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నందివాడ మండలం తమిరిశ గ్రామంలో ఎమ్మెల్యే కొడాలి నాని గురువారం సాయంత్రం పర్యటించారు. గ్రామ పొలిమేరల్లో ఎమ్మెల్యే నానీకు వైఎస్ఆర్సిపి నాయకులు గజమాలలు వేస్తూ, పూల వర్షం మధ్య జిందాబాద్ కొడాలి నాని అంటూ నినాదాలు చేస్తూ ఘన స్వాగతం పలికారు. భారతరత్న బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే కొడాలి నాని, పార్టీ నేతలతో కలిసి గ్రామ పర్యటన ప్రారంభించారు. ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ, వారికి అభివాదాల చేస్తూ ఎమ్మెల్యే కొడాలి నాని పర్యటనను కొనసాగించారు. దారి పొడవున వివిధ రూపాల్లో ఎమ్మెల్యే కొడాలి నానిపై తమకున్న అభిమానాన్ని గ్రామస్తులు చాటుకున్నారు. పలుచోట్ల గుమ్మడికాయలతో ఎమ్మెల్యే నానికి దిష్టి తీయగా,వీధి వీధినా మంగళహారతులు ఇస్తూ మహిళా సోదరిమణులు ఎమ్మెల్యే కొడాలి నానికు ఆత్మీయ స్వాగతం పలికారు. వివిధ వర్గాలతో మమేకమవుతూ పర్యటిస్తున్న ఎమ్మెల్యే కొడాలి నానితో సెల్ఫీలు దిగుతూ,కరచాలనం చేసేందుకు చిన్నారులు యువత ఉత్సాహం చూపించారు. పలుచోట్ల ఎమ్మెల్యే నాని చంటి పిల్లలను అదిస్తున్న దృశ్యాలు చూసిన పార్టీ నేతలు హార్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నాని పర్యటనలో భారీ బైక్ ర్యాలీగా యువత పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. గ్రామ సెంటర్లో స్వర్గీయ వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే నాని తన పర్యటన కొనసాగించారు. అనంతరం ప్రజాప్రతినిధులతో కలిసి రూ.20.80 లక్షల నిధులతో నిర్మించిన వైయస్సార్ ఆరోగ్య కేంద్ర భవనాన్ని ఎమ్మెల్యే కొడాలి నాని ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ ద్వారా రాష్ట్రంలోని 95% ప్రజలకు ఆరోగ్య భద్రత లభిస్తుందని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ఆరోగ్యశ్రీ చికిత్సలు 25 లక్షలకు పెంచడం చారిత్రాత్మకమైని ఎమ్మెల్యే కొడాలి నాని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ , ఎంపీపీ పెయ్యల ఆదాం, గుడివాడ పట్టణ వైసిపి అధ్యక్షుడు గొర్ల శ్రీను, రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, మండల వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ కొండపల్లి కుమార్ రెడ్డి ,ఎంపీటీసీ పిళ్ళా మాణిక్యం, సర్పంచ్ తప్పిట ధనలక్ష్మి , తమిరిశ వైఎస్ఆర్సిపి అధ్యక్షులు తప్పిట సలోమాన్,వైఎస్ఆర్సిపి నాయకులుకందుల నాగరాజు, కరేటి శ్రీకృష్ణ, మసిముక్కు నాగరాజు,
గంట సురేష్,గుదే రవి,మద్దాల బాబుజి, తోట నాగరాజు, కనిగంటి యాకోబు,సన్నాల ఉమాశంకర్,వైఎస్ఆర్సిపి డాక్టర్ సెల్ జిల్లా అధ్యక్షుడు మలిరెడ్డి రవి,మండలంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరియు అభిమానులు , సచివాలయ కన్వీనర్ లు , గృహ సారధులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News