విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పోతిన మహేష్ తన కార్యాలయం నుంచి విడుదల చేసిన వీడియోలో మాట్లాడుతూ జననాయకుడు జగన్మోహన్ రెడ్డి పై దాడిలో కూటమినేతల కుట్ర ఉందని, ఈ కుట్రలో బలమైన నాయకులు ఉన్నారని అనుమానం కలుగుతుందని, ఇందులో పెద్దల హస్తం తో పాటు చాలా పెద్ద కుట్ర దాగి ఉందని చాలా స్పష్టంగా తెలుస్తుందని, జగన్ ప్రాణానికి హాని ఉందనిపిస్తుందని, విజయవాడ నగరంలో మహిళలు యువత ప్రజలు లక్షలాదిగా తరలివచ్చారు జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల ప్రజలకి ఉన్న సంతృప్తి ఆనందానికి ఇదే నిదర్శనంమని, సీఎం జగన్ కి వస్తున్నఅపూర్వ స్పందన చూసి ఓర్వలేకే కుట్ర పన్నారు, కూటమి నేతలకు ప్రజాస్పందన కరువైందని, కేంద్ర ఎన్నికల కమిషన్ విచారణ వేగవంతం చేయాలి ఎన్నికల స్పెషల్ అబ్జర్వర్లు కేంద్రానికి వెంటనే నివేదిక పంపాలి దాడి చేసిన వారిపైన కుట్రలో భాగస్వామ్యం ఉన్న ప్రతి ఒక్కరిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ కి భద్రత పెంచాలని, ప్రజాస్వామ్యబద్ధంగా జననేత సీఎం జగన్ ఎదుర్కోలేకే కుట్రలు పనుతున్నారని అన్నారు.
Prajavartha Online Telugu News