-మైలవరంలో క్రమేపీ క్షీణీస్తోన్న వైకాపా.
-జూపూడి నుంచి టీడీపీలోనికి చేరికలు
ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మైలవరం నియోజవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రమేపీ క్షేణిస్తోంది. ప్రతిరోజు తెలుగుదేశం పార్టీలోనికి వలసలు కొనసాగుతున్నాయి. ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడారు. టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
జి.కొండూరు మండలంలోని వెంకటాపురం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మైలవరం తెదేపా మహాకూటమి అభ్యర్థి, స్ధానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు వైకాపా నాయకులకు పసుపు కండువాలు కప్పి తెలుగుదేశంలోనికి చేర్చుకున్నారు. పి.శ్రీనివాసరావు (నాని), ఎల్.శ్రీనివాసరావు, కె.అజయకుమార్, ఎన్.అరుణ్ కుమార్, బి.స్వామి, కె.రాజు, ఐ.రమేష్, జి.నవీన్, బి.కిరణ్ తదితరులు తెలుగుదేశంలో చేరారు. బీజేపీ, జనసేన, టీడీపీ కుటుంబసభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News