పోలింగ్ రోజు, పోలింగ్ కు ముందు రోజు ప్రచురించే రాజకీయ ప్రకటనలకు యంసియంసి అనుమతి తప్పనిసరి…

-జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం యంసియంసి కమిటీ ముందస్తు అనుమతి లేకుండా పోలింగ్ రోజు, పోలింగ్ కు ముందు రోజు ప్రింట్ మీడియాలో ఎటువంటి రాజకీయ ప్రకటనలను ప్రచురించకూడదన్నారు. గతంలో పలు సందర్భాల్లో ప్రింట్ మీడియాలో అభ్యంతరకరమైన మరియు తప్పుదారి పట్టించే ప్రకటనలు ప్రచురితమయ్యాయన్నారు. వీటివల్ల ప్రభావితమయ్యే అభ్యర్థులు మరియు రాజకీయ పార్టీలకు ఆయా సందర్భాలలో వివరణ/ఖండన అందించే సమయం కూడా ఉండనందున ఎన్నికల చివరి దశలో ఇటువంటి ప్రకటనల వల్ల ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే అవకాశం ఉన్నట్లు ఎలక్షన్ కమిషన్ గుర్తించిందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని అటువంటి ఉదంతాలు పునరావృతం కాకుండా, ఎన్నికల నేపథ్యంలో ఆవేశపూరిత, తప్పుదోవ పట్టించే లేదా ద్వేషపూరిత ప్రకటనల కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం తనకున్న అధికారాలను మరియు దానికి వీలు కల్పించే అన్ని ఇతర అధికారాలను ఉపయోగించుకుని తగు చర్యలు తీసుకుంటుందన్నారు. ఇందులో భాగంగా రాజకీయ ప్రకటనలలోని విషయాలు రాష్ట్ర/జిల్లా స్థాయిలో యంసియంసి కమిటీ వారి నుండి ముందస్తుగా ధృవీకరించబడినట్లయితే తప్ప, ఏ రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి లేదా మరే ఇతర సంస్థ లేదా వ్యక్తి పోలింగ్ రోజున మరియు పోలింగ్ కు ఒక రోజు ముందు ప్రింట్ మీడియాలో ఎలాంటి ప్రకటనను ప్రచురించకూడదని స్పష్టం చేశారు. రాజకీయ ప్రకటనలకు సంబంధించి దరఖాస్తును ప్రచురణ రోజుకు కనీసం 3 రోజులు ముందుగా ఉంటుందన్నారు. వార్తాపత్రిక ప్రకటనల ముందస్తు ధృవీకరణ ప్రక్రియను సులభతరం చేయడానికి, జిల్లా స్థాయిలో యం సి యం సి కమిటీలను అప్రమత్తం చేయటం జరిగిందని, రాజకీయపార్టీలు, అభ్యర్థులు, ఇతర సంస్థల నుండి అందిన అటువంటి ప్రకటనలన్నింటినీ కమిటీలు త్వరితగతిన పరిశీలించి, ముందస్తుగా ధృవీకరిస్తాయని తెలిపారు. జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు, వార్తాపత్రికలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రాజకీయ ప్రకటనల విషయంలో ఎన్నికల కమిషన్ కు సహకరించాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *