-పోలీసు – జిల్లా ఎన్నికల అధికారి సంయుక్త కార్యచరణ ప్రణాళికా
-కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కౌంటింగ్ ప్రక్రియ లో పోలీసు, జిల్లా ఎన్నికల యంత్రాంగం ఆధ్వర్యంలో సంయుక్త కార్యచరణ ప్రణాళికా సిద్ధం చేసినట్లు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె మాధవీలత తెలియ చేశారు. గురువారం స్థానిక కలెక్టర్ ఛాంబర్ నుంచి కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్ల గురించి ఎస్పి, రిటర్నింగ్ అధికారులు, ఇతర అధికారులతో కలక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీ లత మాట్లాడుతూ, జూన్ 4 వ తేదీ కౌంటింగ్ ప్రక్రియ, అనంతరం ఫలితాలు వెల్లడి చేసే క్రమంలో జిల్లా ఎన్నికల యంత్రాంగం , పోలీసు యంత్రాంగం సంయుక్త కార్యచరణ సిద్దం చేసినట్లు తెలిపారు. భద్రత తదితర ముందస్తు చర్యలు పై అభ్యర్ధులకు, కౌంటింగ్ ఏజెంట్స్ లతో శుక్రవారం సమావేశం నిర్వహించి అవగాహన కల్పించాలని ఆదేశించారు. మూడంచెల భద్రత, ఏడు అసెంబ్లి నియోజక వర్గాల పరిధిలో ఏడు సోలార్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పోటిలో నిలిచిన అభ్యర్థుల ఇళ్ళ వద్ద, రాజకీయ పార్టీల ఆఫీసు దగ్గర సీసీ కెమెరాలు నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి , వ్యక్తుల, సమూహాల కదలికలపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి మూడు సార్లు భౌతికంగా హాజరై భద్రత ఏర్పాట్లు పర్యవేక్షణ బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుందన్నారు.
ఓట్ల లెక్కింపులో భాగంగా ప్రతి కౌంటింగ్ హాల్‌కు తప్పకుండా ఒక వీడియోగ్రాఫర్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కౌంటింగ్ హాల్‌లో అభ్యర్థుల జోన్ మరియు మీడియా సిబ్బందిని స్పష్టంగా గుర్తించాలి. కౌంటింగ్ ఏజెంట్లందరికీ వారికి కేటాయించిన టేబుల్‌లను స్పష్టంగా సూచించే బ్యాడ్జీలు ఇవ్వాలన్నారు. ఇప్పటికే నియోజక వర్గాల వారీగా కలర్ కోడ్ ఇవ్వడం జరిగిందన్నారు. ప్రతి రౌండ్‌కు సంబంధించిన డేటాను టేబుల్ చేసిన తర్వాత, ప్రతి పోలింగ్ స్టేషన్‌లో పోలైన ఓట్ల సంఖ్య ఓటరు టర్నౌట్ రిపోర్ట్‌కు క్రాస్ వెరిఫై చేసుకొని నిర్ధారించుకోవాల్సి ఉంటుందనీ స్పష్టం చేశారు. పోల్ సమయంలో భర్తీ చేయబడిన కంట్రోల్ యూనిట్ల (CUలు) డేటాను ముందుగా కౌంటింగ్ టేబుల్‌లకు అందించాలని, వాటి క్రమ సంఖ్య క్రాస్ చెక్ చేయాలన్నారు.
ఈ కాన్ఫరెన్స్ లో ఎస్పి పి. జగదీష్, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, మునిసిపల్ కమిషనర్ కే దినేష్ కుమార్, ఇతర రిటర్నింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News