కేంద్ర కారాగారంలో ఖైదీ సోదరులకు మొక్కల తయారీలో శిక్షణాకార్యక్రమం 

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం కేంద్ర కారాగారములో ఉద్యానవన శాఖ, రాజమహేంద్రవరం మునిసిపల్ కార్పోరేషన్ వారిచే లోపల ఉన్న ముద్దాయిలకు కారాగార పర్యవేక్షణాధికారి శ్రీరామ రాహుల్ ఆధ్వర్యంలో వివిధరకాల పండ్లమొక్కలు, క్రోటాన్స్, పూలమొక్కలు తయారుచేయుట, పెంచుట మరియు నిర్వహించుట, మెళకువలను శిక్షణా తరగతుల యందు ది. 18.06.2024 నుండి 30.06.2024 వరకు మొదటి విడత నిర్వహించుచున్నారు.

కె. స్వాతి, అసిస్టెంట్ డైరెక్టర్, రాజమహేంద్రవరం మునిసిపల్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ప్రారంభించి, ముద్దాయిలను ఉద్దేశించి మాట్లాడుతూ మొక్కలను ఎన్నివిధాలు గా అభివృద్ది చేయవచ్చు, తద్వారా ఎలా ఉపాధి పొందవచ్చో తెలిపారు. ఎంత కృషి చేస్తే అంత వృద్ది పొందవచ్చు అని తెలిపినారు. మునిసిపల్ కార్పోరేషన్ ఉద్యానవన శాఖ ఉద్యోగి బాలు మొక్కల పెంపకంపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ యం. రాజ కుమార్, జైలర్లుఆర్. శ్రీనివాసులు, కె. దుర్గా రమేష్ , కె.వి. రామారావు, సిహెచ్. రమేష్, డిప్యూటీ జైలర్లు, ఇతర సిబ్బంది మరియు ఖైదీలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *