పామాయిల్ వ్యవసాయ క్షేత్రల్ని సందర్శించిన కలెక్టర్ మాధవీలత

గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో పామాయిల్ సాగు చేసేందుకు అనువైన ప్రాంతాలు అందుబాటులో ఉన్నాయనీ వీటి సాగుపట్ల రైతాంగం దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం గోపాపురం నియోజకవర్గం దూబచర్ల నల్లజర్ల మండలాల్లో “3 ఎఫ్ అక్షయ ఎరువుల కేంద్రం మరియు  ఆయిల్ పామ్ నర్సరీ” ని పామాయిల్ తోటలను కలెక్టర్ పరిశీలించి, అక్కడ రైతులతో ముఖాముఖి సంభాషించారు.

స్వయంగా వ్యవసాయ శాస్త్రవేత్త అయిన జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పామాయిల్ తోటలను జిల్లాలో విస్తరించే అవకాశం క్షేత్ర స్థాయిలో అయిల్ పామ్ నర్సరీ, ఎరువుల కేంద్రాన్ని   సందర్శించడం జరిగిందని తెలిపారు. ఈ క్రమంలో అధిక విస్తీర్ణంలో పండిస్తున్న ఆయిల్ పామ్ తోటల యాజమాన్య విధానలను క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేశారు. రైతులతో సంభాషించారు. కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 40 శాతం వాటా ద్వారా ఆయిల్ పామ్ తోటల పెంపకం కోసం అవసరమైన ఆర్థిక చేయూత నివ్వడం జరుగుతుందని, రాబోయే కాలంలో మరింత ప్రోత్సాహం అందజేసేందుకు జిల్లా యంత్రాంగం తరపున చర్యలు తీసుకుంటామని తెలిపారు.

తూర్పు గోదావరి జిల్లాలో ఇంకా 25000 హెక్టార్ లలో ఆయిల్ పామ్ తోటల విస్తీర్ణ కు అవకాశం ఉందని తెలిపారు. నల్లజర్ల, దేవరపల్లి, గోపాలపురం, నిడదవోలు, చాగల్లు, రాజానగరం, రంగంపేట, కోరుకొండ, సీతానగరం, గోకవరం మండలాల్లో చక్కటి అవకాశం ఉందని తెలిపారు. వీటికి అదనంగా అంతర పంటలు అయిన మిరియాలు, పిప్పళ్లు, అనాస, దాల్చినచెక్క, కోకో, జాజి కాయ వంటి వాటికి అంతర పంటలుగా వేసుకునే అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.

3 ఎఫ్ కంపెనీ జనరల్ మేనేజర్ విజయ ప్రసాద్  వివరాలు తెలియ చేస్తూ ముందుగా ఎరువుల కేంద్రం లో రైతులను పెట్టుబడి విధానం, యాంత్రీకరణ , కూలీల సమస్య , ఎరువుల వినియోగం, రాబడి తదితర అంశాల పై సమగ్ర సమాచారం అందించారు.

ఈ సందర్శన లో భాగంగా కలెక్టరు మాధవీలత  నర్సరీ లో జర్మినేషన్ నుండి మొక్కల నాటే ప్రక్రియ వరకు వివరించి వివిధ రకాల పామాయిల్ వెరైటీల గురించి తెలుసుకున్నారు.అనంతరం మలేషియా నుండి దిగుమతి చేసిన హార్వెస్టింగ్ పోల్స్ తో ఆయిల్ పామ్ గెలల కోతల ప్రక్రియను ఆసక్తి గా వీక్షించారు.చావ సుధాకర్ కృష్టి
తో రూపొందించిన హార్వెస్టింగ్ గ్రాబ్బర్  ను పర్యవేక్షించి వారిని అభినందించారు.
యర్నగూడెం ఫ్యాక్టరీ లో ప్రాసెసింగ్ విధానం ను నేరుగా కలెక్టరు వీక్షించడం గమనార్హం.

ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, జిల్లా ఉద్యాన అధికారి సుజాత కుమారి, నల్లజర్ల ఉద్యాన అధికారి  బబిత, దేవరపల్లి ఉద్యాన అధికారి రమేష్, ముసుల్లగుంట సర్పంచ్ నందమూరి శారద దేవి,  రెండు మండలాల  హార్టికల్చర్ అసిస్టెంట్లు 3F కంపెనీ సిబ్బంది,  రైతులు హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *