Breaking News

జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధం

-జిల్లాలో 2,44,302 మంది లబ్దిదారులకు జూలై 1 న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ.
-రూ.165.13 కోట్ల నగదు ఇంటింటి పంపిణీకి ఏర్పాట్లు.
-రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వీడియో కాన్ఫరెన్స్ లో పెన్షన్ల పంపిణీ ఏర్పాట్లను తెలియజేసిన…

రాజమహేంద్రవరం,, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి. జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి వివరించారు.శనివారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్ల తో జూలై 1 న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరం నుంచి కలెక్టర్ ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ హాజరయ్యారు.ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్  ఆదేశాలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమాన్ని ఎటువంటి తప్పిదాలకు తావు లేకుండా నిర్వహించాలన్నారు.  జులై, 1వ తేదీ ఉదయం 6 గంటలకు పెన్షన్ పంపిణీ నమోదు కావాలన్నారు.  మొదటి రోజే 90 నుండి 95 శాతం మేరకు పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలన్నారు. కలెక్టర్ పి. ప్రశాంతి వివరిస్తూ మాట్లాడుతూ జూలై 1 న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ పై అన్ని ఏర్పాటు పూర్తి చేసామన్నారు. ఉదయం 5 గంటలు నుండే పెన్షన్ ప్రక్రియ ప్రారంభించి, 1వ తేదీనే 100 శాతం మేర పెన్షన్లు పంపిణీ అయ్యేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు.  పెన్షన్ల పంపిణీకి గ్రామ,వార్డ్ సచివాలయ సిబ్బంది సేవలను వినియోగిస్తున్నామని, అదనపు సిబ్బందిగా వివిధ శాఖలలోని జూనియర్ అసిస్టెంట్, తదితర సిబ్బంది సేవలు వినియోగిస్తున్నామన్నారు.   అందుకు సంబందించిన సాంకేతిక పరికరాలను సిబ్బందికి అందించడం జరిగిందని, అదనపు సిబ్బందికి బయో మెట్రిక్ యంత్ర పరికరం వినియోగంపై శిక్షణ అందించడం జరిగిందన్నారు. అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ జూలై ఒకటవ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ పక్రియ ఉదయం 5 గంటలు నుంచే ప్రారంభం కావాలని  అధికారులకు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టత్మకంగా ప్రభుత్వం చేపట్టిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించి, లబ్దిదారులకు అత్యంత పకడ్బందీగా పెన్షన్ నగదు చెల్లింపులను జరపాల్సి ఉందన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు మేరకు అమలు చేయాలని స్పష్టం చేశారు. ఇంటింటికీ సామాజిక భద్రతా పింఛన్లు ప్రభుత్వ ఉద్యోగులు ద్వారా అందించే క్రమంలో ఎక్కడా ఎటువంటి ఆటంకాలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అన్నారు. ఇందుకు సంబంధించి ముందుగాన బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరణ చేసి, జూలై ఒకటవ తేదీన ఉదయం 5 గంటల నుంచి నగదు చెల్లింపులు జరిగేలా మండల అభివృద్ది అధికారులు, మునిసిపల్ కమిషనర్ లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.జిల్లాలో 2,44,302 మంది పెన్షన్ లబ్దిదారులకు రూ.165.13 కోట్ల నగదు ఇంటింటి పంపిణీ ని నిమిత్తం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశా మన్నారు ఎందుకు సంబంధించి జిల్లాలో 9,552 క్లస్టర్ వారీగా 2,44,302 మంది పెన్షన్ లబ్దిదారులను గుర్తించడం జరిగిందని,ఆయా క్లస్టర్ వారీగా సి ఎఫ్ ఎమ్ ఎస్ గుర్తింపు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధిదారులను అనుసంధానం చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, డిఆర్ డి ఏ పి డి.. ఎన్ వివిఎస్ మూర్తి, డి ఎల్ డి వో లు పి. వీణా దేవి, బి శాంత మణి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెనుగంచిప్రోలులో మజ్జిగ పంపిణీ కార్యక్రమం

పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : పెనుగంచిప్రోలు మండలంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్, పెనుగంచిప్రోలు బ్రాంచ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *