-మున్సిపల్ అదనపు కమిషనర్ పీఎం సత్యవేణి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను త్వరిత గతిన పరిష్కరించేందుకు స్పందన స్థానంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘ కు శ్రీకారం చుటిందని నగరపాలక నగరపాలక సంస్థ మున్సిపల్ అదనపు కమిషనర్ పీఎం సత్యవేణి అన్నారు. సోమవారం ఉదయం నగర పాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి నగరపాలక నగరపాలక సంస్థ కమీషనర్ తరపున మున్సిపల్ అదనపు కమిషనర్ పీఎం సత్యవేణి 22 అర్జీలను స్వీకరించామన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ అదనపు కమిషనర్ పీఎం సత్యవేణి మాట్లాడుతూ ప్రజల సమస్యలను అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, పరిష్కారము చెయ్యాలని ఆదేశించడం జరిగిందన్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో వచ్చిన అర్జీలు:
డ్రైనేజి, మురుగు నీరు, త్రాగునీరు, టీడ్కో ఇళ్ళు, ఇంటి పన్ను, వీధిలైట్స్, సరిహద్దు సమస్య తదితర సమస్యలు పై అర్జీ దారుల నుంచి ఫిర్యాదులు అందాయన్నారు.
ఈ రోజు వచ్చిన అర్జీలు…
రాజనగరం మండలం, పాలచర్ల కు చెందిన బోనం శివాజీ సాధారణ ఎన్నికలు 2024 లకు బి.వి.సి ఇంజనీరింగ్ కాలేజీ, పాలచర్ల చెందిన బస్సులను వినియోగించుకోవడమైనదని దానికి సంబంధించి పేమెంట్ ఇప్పించవలసిందిగా కోరుట.
రాజమహేంద్రవరం, సీతంపేట కు చెందిన పి నిరీక్షణ తనకు కేటాయించిన టిట్కో ఇళ్ల ఫ్లాట్ ను వృద్ధురాలైన తల్లి, వికలాంగుడు అయిన కుమారుడు ఉన్నందున తన కు కేటాయించిన ప్లాటును కింది ఫ్లోర్ కు మార్చవలసిందిగా కోరు.
రాజమహేంద్రవరం ఉల్లి తోట వీధి కి చెందిన జి రాధాకృష్ణ తమ వీధిలో మున్సిపల్ వాటర్ పైపు లైన్ లీకేజీ అయినందున సమస్యను పరిష్కరించవలసినదిగా కోరుట.
రాజమహేంద్రవరం మున్సిపల్ కాంట్రాక్టర్ సిహెచ్ వెంకటరమేష్ తాను జి జి ఎం పి గ్రాంట్స్ లో పూర్తి చేసిన వర్కులకు సంబంధించి బిల్లులు పాస్ ఆర్డర్ పూర్తయిన సి.ఎఫ్ ఎం. ఎస్ సైట్ లో కాలం అయిపోయినది తిరిగి జిజిఎంపి గ్రాంట్స్ ఫండ్ బిల్లులు ఇప్పించవలసిందిగా కోరుట.
రాజమహేంద్రవరం సింహాచల్ నగర్ క్వారీ మార్కెట్ కు చెందిన ఎం చంద్రిక హౌస్ సింహాచల్ నగర్ నందు త్రాగునీరు సౌకర్యం వీధిలైట్లు సమస్య పరిష్కరించవలసిందిగా కోరుట.
రాజమహేంద్రవరం కు చెందిన ఎన్ సుబ్రహ్మణ్యం సదరం స్కూల్ దగ్గర మైదవోలు వారి వీధి కన్జర్వెన్సీ రిజిస్ట్రేషన్ కొరకు.
రాజమహేంద్రవరం, ఖమ్మం సత్రం పెద్ద మసీదు కు చెందిన ఏ పార్థసారథి అనే వ్యక్తి ఖమ్మం సత్ర వీధి నందు పురాతన శిథిలావస్థలో ఉన్న ఇల్లు రాత్రి పగలు అసాంఘిక కార్యకలాపాలు జరుగుచున్నందున భవనం పడగొట్టవలసినదిగా కోరుతూ విన్నపం
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సూపర్నెంట్ ఇంజనీర్ జి పాండురంగారావు, సిటీ ప్లానర్ జి.వి.ఎస్. ఎన్. మూర్తి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News