– కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కందిపప్పు, బియ్యం ధరల నియంత్రణా చర్యల్లో భాగంగా గురువారం నుంచి రైతు బజార్ల ద్వారా సబ్సిడీ పై వినియోగ దారులకు అందుబాటులోకి తీసుకుని రావడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా ధరల నిర్ణయ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఇటీవల కాలంలో నిత్యావసర వస్తువు లైన బియ్యం, కంది పప్పు బహిరంగ మార్కెట్ లో పెరుగుదల నేపధ్యంలో వినియోగదారులకు సరసమైన ధరలకు అందించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కందిపప్పు ను వినుకొండ మిల్లర్ల ద్వారా, బియ్యాన్ని కాకినాడ, రాజమండ్రి ప్రాంతాల్లోని మిల్లర్ల ద్వారా కొనుగోలు చేసి, ప్రజలకి అందజేయాల్సి ఉందన్నారు. జాయింట్ కలెక్టర్ , పౌర సరఫరాల , మార్కెటింగు అధికారులు ఆయా మిల్లర్ల తో సంప్రదించి సహేతుకమైన ధరను నిర్ణయించాలన్నారు. ఈరోజు మిల్లర్ల తో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. ధరల పెరుగుదల నేపధ్యంలో నిఘా పెంచాల్సి ఉందని, రెవిన్యూ, పోలీసు పౌర సరఫరాల శాఖల ఆధ్వర్యంలో జాయింట్ బృందాల క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేపట్టాలని ఎస్పీ పి జగదీష్ కి తెలిపారు. సిపివో మార్కెట్ విలువల వత్యస్యం పై అనాలసిస్ చెయ్యాలని తెలియ చేసారు.
ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ, ధరల విషయములో మిల్లర్ల తో సంప్రదించి తగిన నిర్ణయం తీసుకుంటామని, ఆమేరకు నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. గురువారం ప్రజా ప్రతినిధుల సమక్షంలో క్వారీ రైతూ బజార్ లో సబ్సిడీ లో బియ్యం అందుబాటులోకి తీసుకొని రానున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి ఆయా నిర్దేశించిన షాప్ లలో అమ్మకాలనీ ప్రారంభించడం జరుగుతుందన్నారు.
ఈ సమావేశంలో ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ ఎస్పీ పి జగదీష్ డిఎస్ఓపి విజయభాస్కర్, సిపిఓ ఎల్ అప్పలకొండ, మార్కెటింగ్ ఏడి ఎం సునీల్ వినైయ్ తదితరులు పాల్గొన్నారు.