వెలుగుబంద హౌసింగ్ లే అవుట్ ను పరిశీలించిన కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త :
మంగళవారం సాయంత్రం స్థానిక రాజానగరం మండలం వెలుగుబంద హౌసింగ్ కాలనీ ని హౌసింగ్ , ఆర్ ఎం సి, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కలిసి కలెక్టర్ సందర్శించి, గృహ లబ్దిదారులతో వారి సమస్యలు పై క్షేత్ర స్థాయిలో అవగాహాన కలుగ చేసుకున్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, వెలుగబంద లే అవుట్ గృహ లబ్దిదారులు సమస్యలు పరిష్కారం కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ లేఅవుట్ లో మరింత మంది లబ్దిదారులు ఇళ్ళ నిర్మాణాలు చేపట్టే దిశగా అవగాహనా కల్పించాల్సిందిగా క్షేత్ర స్థాయి అధికారులకి, సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వానికి మీ సమస్యలు తీసుకుని వెళ్లి పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కలెక్టర్ వెంట హౌసింగ్ పిడి ఆర్ కృష్ణ నాయక్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ డి. బాలశంకర్ రావు, డీ ఈ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *