1500 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జెన్పాక్ట్ ఆధ్వర్యంలో 1500 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఏ. కొండల రావు బుధవారంలో తెలిపారు. జాబ్ రోల్స్ లో భాగంగా కంటెంట్ మోడరేషన్ మరియు కస్టమర్ సర్వీస్ వాయిస్ సపోర్ట్ విభాగాలలో యువతి/యువకులు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపాటు. ఎవరైతే గత మూడు విద్యా సంవత్సరాలలో డిగ్రీ, బీటెక్ 2022/2023/2024 సంవత్సరాలలో పూర్తి చేసి మరియు కమ్యూనికేషన్స్ స్కిల్స్ మీద మంచి పట్టు ఉన్న వారు అర్హులు అన్నారు. జాబ్ లోకేషన్ వచ్చి హైదరాబాద్ (హఫీజ్పేట్ ) ఉంటుందని ఎం.కొండలరావు తెలియజేశారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఈ క్రింది వెబ్సైట్ నందు వివరాలు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 99888 53335 నంబర్ ను సంప్రదించాలని నిరుద్యోగ యువతకు తెలియ చేశారు. వెబ్ సైట్ వివరాలు : https://bit.ly/46Wzqz6

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *