
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు “3వ విడత బట్టల పంపిణీ” మంగళవారం గమీలా బజార్, ఆటోనగర్ నందు 150 మందికి బట్టలు, దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. రూట్స్ చైర్మన్ డాక్టర్ పోలవరపు విజయ భాస్కర్ మాట్లాడుతూ ఇక్కడ చాలామంది జ్వరాలతో బాధపడుతూ ఇంటిదగ్గరే వుంటున్నారు. వీరందరికి 11వ తారీకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు “ఉచిత వైద్య శిబిరం” నిర్వహించి మందులు ఉచితంగా ఇస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు ఎ .ఎస్.ఆర్.శర్మ, ఎలమందయ్య, విజయలక్ష్మి, తారకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News