– వైసీపీ నగర అధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నిరాడంబరుడు, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణ వార్త దిగ్బ్రాంతికి గురిచేసిందని వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. విద్యార్థి నేతగా రాజకీయాలలోకి అడుగు పెట్టి జాతీయ రాజకీయాలలో తనదైన ముద్ర వేశారన్నారు. తెలుగు వాడిగా తన రాజకీయ వాణిని ఢిల్లీ స్థాయిలో వినిపించారని.. నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు పోరాటం చేసిన యోధుడని కీర్తించారు. ప్రజా సమస్యలపై గళం విప్పుతూ.. ఎగువ సభలో గుర్తింపు పొందారన్నారు. ఆయన మరణం కార్మిక లోకానికి తీరని లోటని చెప్పుకొచ్చారు. ఏచూరి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Prajavartha Online Telugu News