ఊపిరితిత్తుల సంరక్షణ మన అందరి బాధ్యత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ ఊపిరితిత్తుల దినోత్సవ సందర్భంగా వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో నాలుగవ క్రాస్, ఆరవ రోడ్డు వద్ద వైద్యసిభిరాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా మెడికల్ అధికారి డాక్టర్ ఆర్. స్వర్ణలత మాట్లాడుతూ అపోలో టైర్స్ పౌండేషన్ సహకారంతో వాసవ్య మహిళా మండలి ఆటోనగర్ కార్మికులకు వైద్య సేవలను అందిస్తుందని అన్నారు. క్షయ వ్యాధి నిర్మూలనలో భాగంగా ఈనెల 15 నుండి 30 వ తారీకు వరకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, లక్షణాలున్న వారికి కళ్ళె పరీక్షలను నిర్వహిస్తున్నామని ఆమె అన్నారు. ఈ రోజు ప్రపంచ ఊపిరితిత్తుల దినోత్సవం కావున ఈ వైద్య సిబిరం ఏర్పాటు చేయడమైనదని ఆమె అన్నారు. ప్రతీ ఒక్కరూ ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవాలని ఆమె అన్నారు. అవి పాడవడానికి ప్రధాన కారణం ధూమపానం అని దీనిద్వారా ఊపిరితిత్తులు పాడవడమే కాకుండా క్యాన్సర్ వచ్చే ప్రమాధం ఉందని ఆమె అన్నారు. ఇండోర్ లో పనిచేసే కార్మికులు స్వచ్చమైన గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవాలని, ప్రతిరోజు కనీసం 30నిమిషాలైనా వ్యాయామం చేయాలని (మెట్లు ఎక్కడం వల్ల అధిక ఉపయోగం ఉంది), ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించి పరీక్షించుకోవాలని ఆమె అన్నారు. వైద్య సిబిరం లో కార్మికులకు సాధారణ అనారోగ్య సమస్యలతో పాటు కంటి పరీక్షలను చేయడం, ఉచితంగా మందులను అందజేయడం జరిగిందని ఆమె అన్నారు. సిబిరాన్ని సందర్సించిన వారిలో 8 మంది దగ్గర కళ్ళె (కఫం) ను సేకరించడం జరిగిందని ఆమె అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ మేనేజర్ కె.శ్రీనివాసరావు, ఆపమెట్రిస్ట్ ఫిరోజ్ బాషా, ఫార్మసిస్ట్ యం.అజయ్ బాబు, కౌన్సిలర్ ఎ.సత్యప్రసాద్, ల్యాబ్ టెక్నిషియన్ టి.మహాలక్ష్మి ఔట్ రీచ్ సర్కర్ కె.స్మిత. పీర్ ఎడ్యుకేటర్లు అబ్బుల్ రెహ్మాన్, సుంకరి శంకర్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *