విద్యార్థినిలకు సైకిళ్ళు, మహిళలకు కుట్టు మిషన్లు పంపిణి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గన్నవరం నియజకవర్గం లో ఆదివారం వై.యన్.ఆర్ ఛారిటీస్ ఆధ్వర్యంలో విద్యలో ప్రతిభ కనబరిచిన 20మంది విద్యార్థినిలకు సైకిళ్ళు మరియు 10 మంది చేతి వృత్తి చేసుకునే మహిళలకు కుట్టు మిషన్లు ను ఎన్టీఆర్ జిల్లా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్, వై.యన్.ఆర్.ఛారిటీస్ చైర్మన్ యలమంచిలి జయ ప్రకాష్ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా పాల్గొని వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లు గంగుల శ్రీనివాస్, శేఖర్, మాదు బోస్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *