విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రేమ పెళ్ళి చేసుకున్న తనకు తల్లిదండ్రులు నుంచి రక్షణ కల్పించాలని సరిధే భూమిక శ్రీ కోరారు. సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాజమహేంద్రవరం రాజేంద్ర నగర్ కు చెందిన తాను అదే ప్రాంతానికి చెందిన పెనుమచ్చల హరిప్రసాద్ తో గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నామని తెలిపారు. విషయం తెలుసుకున్న తమ తలిదండ్రులు మూడు సంవత్సరాల క్రితం హరిప్రసాద్ పై కేసులు పెట్టి జైలుకు పంపారని తెలిపారు. ఈ క్రమంలో అక్టోబర్ 29వ తేదీన ఏలూరులోని బహుజన సేన కార్యాలయంలో బౌద్ధ ధర్మ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం సామాజిక సమతా వివాహం చేసుకున్నామని తెలిపారు. నాటి నుంచి తామిద్దరినీ చంపేస్తామని తమ తలిదండ్రులు బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దయచేసి మా ఇద్దరినీ వేరు చేయొద్దని కోరుకుంటున్నాం. ప్రభుత్వం చొరవ తీసుకొని అదికారులు ,పోలీస్ డిపార్ట్మెంట్ వారు స్పందించి మాకూ రక్షణ కల్పించాలని
కోరారు. ఈ సమావేశంలో పెనుమచ్చల హరిప్రసాద్, గుత్తుల సత్యనారాయణ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News