Breaking News

కాలుష్య రహిత నగరానికై యూనిడో ప్రతినిధులతో సమావేశం

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కాలుష్య రహితం నగరంగా విజయవాడ ను మార్చేందుకు సహాయపడుతున్న యూనిడో ప్రతినిధులతో విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర బుధవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల తమ ఛాంబర్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న ఎస్టీపీల లో జరుగుతున్న అభివృద్ధి పనులను చర్చించారు, వాడుక నీటి శుద్ధతపై నగరపాలక సంస్థ తీసుకుంటున్న చర్యలు, యూనిడో నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను పురోగతి తదితర అంశాలపై చర్చించి, నగరాన్ని మరింత కాలుష్యరాహిత నగరాన్ని తీర్చిదిద్దటానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు వంటి అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో విజయవాడ నగరపాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర్ రెడ్డి, సీనియర్ టెక్నికల్ అడ్వైజర్ డాక్టర్ ఎన్.పీ సింగ్, కోఆర్డినేటర్ దీపిక పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *