Breaking News

ఉచిత ఇసుక పాలసీ పటిష్టవంతంగా అమలుచేసి ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా చర్యలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఉచిత ఇసుక పాలసీ పటిష్టవంతంగా అమలుచేసి ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి sand కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించారు. ఇసుక రీచ్ లలో మిషనరీ, భారీ వాహనాలు అనుమతించకుండా చూడాలని, ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా అరికట్టాలని, ఇందుకోసం ఇసుక రీచ్ ల ప్రవేశ మార్గాల వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి పర్యవేక్షించాలని, ప్రతి రీచ్ కు ఇంచార్జ్ అధికారులను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా, డివిజన్, మండల స్థాయి టాస్క్ ఫోర్స్ బృందాలు ఇసుక రీచ్ ల తనిఖీలు నిర్వహించి, ఉచిత ఇసుక సరఫరా సజావుగా జరిగేలా చూడాలని, ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాలన్నారు. ఉచిత ఇసుక పాలసీ నిబంధనలు, నది పరిరక్షణ చట్టం, వాల్టా చట్ట నిబంధనలు, హైకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు పాటించేలా టెక్నికల్ బృందాలు పిరియాడికల్ తనిఖీలు నిర్వహించాలన్నారు. బందరు పోర్టు అభివృద్ధి పనులకు, ఎయిర్పోర్ట్ అభివృద్ధి పనులకు, ఉపాధి హామీ పనులకు ఇసుక సరఫరా కోసం జిల్లాలో రెండు రీచ్ లు కేటాయించినట్లు తెలిపారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్, కమిటీ వైస్ చైర్మన్ గీతాంజలి శర్మ, ఏఎస్పి వివి నాయుడు, గనుల శాఖ ఉపసంచాలకులు కే. శ్రీనివాస్ కుమార్, జిల్లా భూగర్భ జల ఉపసంచాలకులు డి. విజయవర్ధన్ రావు, ఇరిగేషన్ ఈఈ కేసి డివిజన్ రవి కిరణ్, రవాణా శాఖ ఎంవిఐ సిద్ధిక్, స్టేట్ టాక్స్ డిపార్ట్మెంట్ జీఎస్టీ అధికారి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రిన్సిపల్ సెక్రటరీ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంకే మీనా జిల్లా కలెక్టర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి స్థానిక వినియోగం కోసం ముందస్తు సమాచారం, రిజిస్ట్రేషన్లు మరియు ఇసుక సరఫరా పరిస్థితి, మాన్యువల్ రీచ్‌ల నిర్వహణ, టెండర్ల ఖరారు & రేటు స్థిరీకరణ, బల్క్ యూజర్ సమస్యలు,
జిల్లాలో ప్రస్తుత ధరలు, స్వీకరించిన ఫిర్యాదులు & పరిష్కారాలు, వచ్చిన ఇసుక ఆర్డర్ల పోస్ట్ వెరిఫికేషన్ తదితర అంశాలపై సమీక్షించారు. జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని జిల్లాలో ఉచిత ఇసుక పాలసీ అమలు వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *