-కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతికి వచ్చేందుకు సంస్థలు ఆసక్తి
-గతంలో భూకేటాయింపులు చేసిన సంస్థలతో సంప్రదింపులు జరపాలని సీఆర్డీయేకు ఆదేశాలు
-మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలు
-సమావేశం తర్వాత మీడియాతో మంత్రులు నారాయణ,పయ్యావుల కేశవ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గత ప్రభుత్వం ఆడిన మూడుముక్కలాట తో అమరావతిలో భూములు పొందిన సంస్థలు నిర్మాణాలు ప్రారంభించేందుకు ముందుకు రాలేదన్నారు మంత్రి పొంగూరు నారాయణ.గత టీడీపీ ప్రభుత్వంలో అమరావతిలో భూములు కేటాయించిన వివిధ సంస్థలతో సంప్రదింపులు జరపాలని సీఆర్డీఏ అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు..సచివాలయంలోని రెండో బ్లాక్ లో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది…రాజధానిలో భూకేటాయింపులకు సంబంధించి ఆరుగురు మంత్రులు,అధికారులతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుచేసింది ప్రభుత్వం..ఈ ఉపసంఘం మొదటి సమావేశం సచివాలయంలో జరిగింది..మంత్రులు పయ్యావుల కేశవ్,నారాయణ,కొల్లు రవీంద్ర,కందుల దుర్గేష్,టీజీ భరత్ తో పాటు సీఎం కార్యదర్శి ప్రద్యుమ్న,సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్,మున్సిపల్ శాఖ కార్యదర్శి కన్నబాబుఆర్ధిక శాఖ కార్యదర్శి జే నివాస్,సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్ పాల్గొన్నారు.
రాజధానిలో 2014-19 మధ్య కాలంలో సుమారు 130 సంస్థలకు సీఆర్డీఏ భూకేటాయింపులు చేసింది..ఏయే సంస్థలకు ఎక్కడెక్కడ ఎంతెంత భూకేటాయింపులు చేసారనే దానిపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించినట్లు మంత్రి తెలిపారు…గతంలో భూములు కేటాయించిన సంస్థలతో చర్చించాలని సీఆర్డీయే అధికారులను ఆదేశించామన్నారు.గత ప్రభుత్వ మూడుముక్కలాటతో భూములు పొందిన సంస్థలు నిర్మాణానికి ముందుకు రాలేదన్నారు…అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి వారికి నమ్మకం వచ్చిందన్నారు..ఆయా సంస్థలు అమరావతికి వస్తాం – నిర్మాణాలు ప్రారంభిస్తాం అని ముందుకొస్తున్నాయన్నారు..అలాంటి వాటి విషయంలో చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంటామన్నారు..మరోవైపు అమరావతిలో నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయిన వాటికి సంబంధించిన టెండర్ల రద్దు పై సాంకేతిక కమిటీ ఇచ్చిన నివేదికను ఈనెల 18న జరిగే కేబినెట్ లో పెట్టి ఆమోదం తీసుకుంటామన్నారు..కేబినెట్ ఆమోదం తర్వాత కొత్త టెండర్లు పిలుస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేసారు.
పయ్యావుల కేశవ్,మంత్రి.
అమరావతిలో ప్రాజెక్ట్స్ వేగవంతం చేయాలని నిర్ణయించాం.గతంలో భూములు కేటాయించిన సంస్థలు త్వరగా నిర్మాణాలు ప్రారంభించే లా వారితో సంప్రదింపులు జరుపుతాం.అందరినీ పిలిచి సమస్యలు పరిష్కరించి ముందుకు వెళ్తాం.భూములు కేటాయించిన సంస్థలకు ఏవైనా సమస్యలుంటే పరిష్కరించుకుంటూ ముందుకెళ్లాం.సీఎం చంద్రబాబు ఆదేశాలతో ప్రతి పదిరోజులకోసారి కేబినెట్ సబ్ కమిటీ సమావేశమై నిర్ణయాలు తీసుకుంటాం.
Prajavartha Online Telugu News