-డ్రోన్ల ద్వారా 17 కిలోమీటర్ల రోడ్ సర్వే
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నగరంలో స్మార్ట్ రోడ్ల కొరకు శనివారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర డ్రోన్ల ద్వారా సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న మూడు సర్కిల్లోనూ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ లో స్మార్ట్ రోడ్లను 11 ప్రాంతాలలో నిర్మించేందుకు 17 కిలోమీటర్ల రోడ్ సర్వేను డ్రోన్ ద్వారా నిర్వహించారు. ఈ రోడ్ సర్వేలో రోడ్డుపై ఉన్న గుంతలు, డివైడర్, పేవర్ బ్లాగ్స్, ఫుటపాత్ లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్ లు పరిగణంలో ఉంచుకొని రోడ్ సర్వేను చేస్తున్నట్లు తెలిపారు. స్మార్ట్ రోడ్ల ద్వారా కేవలం నాణ్యమైన రోడ్లనే కాకుండా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ ద్వారా ఆదాయం పెంచే వనరులను కల్పించే విధంగా ప్రణాళికను రూపొందిస్తున్నారని తెలిపారు. స్మార్ట్ రోడ్లను నిర్మించడమే కాకుండా ఒక సంవత్సరం పాటు వారి నిర్వహణ బాధ్యత కూడా ఏజెన్సీ వారిదేనని తెలిపారు.
స్మార్ట్ రోడ్లను సర్కిల్ వన్ పరిధిలో బి ఆర్ పి రోడ్, కేటీ రోడ్, నెహ్రూ రోడ్, కుమ్మరిపాలెం సెంటర్, సితార సెంటర్లో 7.3 కిలోమీటర్లు, సర్కిల్ 2 పరిధిలో బి ఆర్ టి ఎస్ రోడ్, సాంబమూర్తి రోడ్, జి ఎస్ రాజు రోడ్, కండ్రిక జంక్షన్ లో 6.2 కిలోమీటర్లు, సర్కిల్ 3 పరిధిలో హెచ్ టీ లైన్, గురునానక్ కాలనీ మెయిన్ రోడ్, పిన్నమనేని పాలి క్లినిక్ రోడ్డు లో 4.14 కిలోమీటర్లు, మొత్తంగా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో 17 కిలోమీటర్లు స్మార్ట్ రోడ్లను నిర్మిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.
Prajavartha Online Telugu News