Breaking News

Tag Archives: amaravathi

నీటిపారుదల రంగానికి కొత్త దిశ – 36 ప్రాజెక్టులకు స్పష్టమైన గడువులు

-రాష్ట్ర జలవనరుల అభివృద్ది శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని మొత్తం 36 ప్రాజెక్టులకు స్పష్టమైన గడువు పెట్టుకుని పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికత్ష పూర్తి చేయాలనే లక్ష్యాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించడం జరిగిందని రాష్ట్ర జలవనరుల అభివృద్ది శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన ఇరిగేషన్ ప్రాజక్టులపై సమగ్ర సమీక్ష జరిగిందని, …

Read More »

పెండింగ్ వ్యవసాయ కనెక్షన్లు తక్షణమే మంజూరు చేయండి… : మంత్రి గొట్టిపాటి రవి కుమార్

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న అన్ని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను తక్షణం మంజూరు చేయాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని మూడు విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు లోతేటి శివ శంకర్, పృథ్వి తేజ్ ఇమ్మడి, పి.పుల్లారెడ్డిలతో సోమవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడుతూ.. వేసవిలో గృహ, వ్యాపార, పారిశ్రామిక వినియోగదారులకు నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా …

Read More »

జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులపై మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆధ్వర్యంలో 4 వ టాస్క్ ఫోర్స్ కమిటీ సమీక్ష సమావేశం

-భూసేకరణ, అటవీ క్లియరెన్స్ వంటి పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుని, నిర్ణీత కాల వ్యవధిలో ప్రాజెక్టులను పూర్తి చేయాలని మంత్రి ఆదేశం -NH, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం అందిస్తోన్న సహకారం అందిపుచ్చుకునేందుకు సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చిన మంత్రి -డిసెంబర్ 2026 నాటికి పెండింగ్ జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేయాలని మంత్రి దిశానిర్ధేశం… అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ సమస్యలను త్వరితగతి …

Read More »

మెరుగుపడుతున్న పీహెచ్సీల పనితీరు!

-గడిచిన 6 నెలల్లో 107 నుంచి 312కు పెరిగిన ‘ఎ’ శ్రేణి ఆరోగ్య కేంద్రాలు -‘బి’ శ్రేణిలో 354 నుంచి 455 కు చేరిన పీహెచ్సీలు -మొత్తం 306 కేంద్రాల పనితీరు మరింత మెరుగు -సి,డి,ఇ కేటగిరి కేంద్రాలూ తగ్గుదల -మొత్తం వైద్య ఆరోగ్య శాఖ స్వీయ సమీక్షతో సత్ఫలితాలు -మంత్రి సత్యకుమార్ యాదవ్ కు నివేదించిన డీహెచ్ డాక్టర్ పద్మావతి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణులకు చేరువులో ఉoడే ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉత్తమ పనితీరును కనబరుస్తున్నాయి. ఓపీ, …

Read More »

ఖరీఫ్ కు వ్యవసాయ శాఖ పూర్తి సన్నద్ధత

-ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేలా సమగ్ర కార్యాచరణ -యూరియా సరఫరా, నిల్వలపై కఠిన పర్యవేక్షణ -రైతులకు ప్రత్యేక యూరియా కార్డుల విధానం -సుస్థిర వ్యవసాయం వైపు ప్రభుత్వం దృష్టి -వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఖరీఫ్-2026 సీజన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఎల్‌నినో పరిస్థితుల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమగ్ర ముందస్తు ప్రణాళికలను …

Read More »

ఖరీఫ్ సాగునీటి విడుదలకు షెడ్యూల్ రిలీజ్.

-కాలువల మరమ్మతులు వేగవంతం చేయాలి. -ఖ‌రీఫ్-2026 ను స‌మ‌ర్ధ‌వంతంగా నిర్వ‌హించాలి. -వ్యవసాయ, ఇరిగేషన్ శాఖల కోఆర్డినేషన్ మీటింగ్. -మంత్రులు నిమ్మ‌ల రామానాయుడు, కింజ‌రాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టులలో ఉన్న నీటి నిల్వలు ఆధారంగా, రానున్న ఖరీఫ్ సీజన్ కు సాగు నీటి విడుదలకు సంబందించి షెడ్యూల్ విడుదల, విత్తనాలు, ఎరువుల లభ్యత పై వ్యవసాయ, ఇరిగేషన్ శాఖల ఉన్నతాధికారులతో సోమవారం అమరావతి సచివాలయంలో మంత్రులు కింజారపు అచ్చన్నాయుడు, నిమ్మల రామానాయుడు ఇరు శాఖలతో కోఆర్డినేషన్ …

Read More »

ఉద్యాన రైతుల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది

– మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఉద్యాన పంటల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. స్వీట్ ఆరెంజ్ తోటల్లో నీటి ఒత్తిడి పరిస్థితులపై ఇప్పటికే రెండు నెలల క్రితమే అనంతపురం జిల్లాలో అధికారుల‌ను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ఈ అంశంపై శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు ఫీల్డ్ విజిట్‌లు నిర్వహించి పరిస్థితిని సమీక్షిస్తున్నారని, రైతులకు అవగాహన కార్యక్రమాలు కూడా …

Read More »

నదుల అనుసంధానానికి ఆధ్యుడు కె.ఎల్.రావ్

-పట్టిసీమ 5ఏళ్ళలోనే 50వేల కోట్ల సంపద సృష్టించింది. -కె.ఎల్. రావ్ వర్దంతి వేడుకల్లో మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ చరిత్రను మార్చిన హీరాకుడ్, భాక్రానంగల్, శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి బహుళార్దక సాధక ప్రాజెక్టుల నిర్మాణంలో కీలక పాత్ర వహించిన మహోన్నత వ్యక్తి ప్రముఖ ఇంజనీర్ కె.ఎల్. రావు అని కొనియాడారు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. సోమవారం అమరావతి సచివాలయంలో పద్మభూషణ్ డాక్టర్. కె.ఎల్ రావు వర్దంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల …

Read More »

APCRDA ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన “యువ సంగం” బృందం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : “ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ ” కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్ర నుంచి విచ్చేసిన “యువ సంగం” విద్యార్ధి బృందం ప్రజారాజధాని అమరావతి- రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయాన్ని సోమవారం సందర్శించింది. ఈ బృందం గ్రౌండ్ ఫ్లోర్‌లోని “అమరావతి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(AICCC)ను సందర్శించింది. APCRDA అధికారులు.. రాజధాని అమరావతిని రైతుల భాగస్వామ్యంతో ఏ విధంగా ప్రణాళికాయుతంగా నిర్మిస్తున్నామో AICCCలోని భారీ స్క్రీన్‌పై వివరించారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లో భాగంగా నిర్మిస్తున్న ఐకానిక్ టవర్స్, హైకోర్టు, అసెంబ్లీ …

Read More »

ఏపీ సిఆర్డిఏ కార్యాలయంలో “గ్రీవెన్స్ డే” నిర్వహణ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతిలో రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో సోమవారం “గ్రీవెన్స్ డే” నిర్వహించారు. ల్యాండ్ పూలింగ్, రిటర్నబుల్ ప్లాట్ల రీ ఎలాట్మెంట్, నెగోషియేటెడ్ సెటిల్మెంట్ పాలసీ(NSP) అమలు తదితర సమస్యల గురించి పలువురు రాజధాని ప్రాంతవాసులు తమ అర్జీలను కమిషనర్ వి.విజయరామరాజు IAS, అడిషనల్ కమిషనర్ ఏ.భార్గవతేజ IAS, కొల్లాబత్తుల కార్తీక్ IAS లకు అందజేశారు. అర్జీదారులు అందజేసిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని వారు తెలియజేశారు. అలాగే కొన్ని …

Read More »