Breaking News

Tag Archives: amaravathi

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకు అంతర్జాతీయ గౌరవం.. ‘బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్’గా ఎంపిక

-మంత్రి కందుల దుర్గేష్‌కు ప్రతిష్ఠాత్మక ‘మెట్రో ఎక్స్‌పెడిషన్ – GTM టూరిజం అవార్డు 2026’ ఆహ్వానం -జూన్ 4న తిరువనంతపురంలో అవార్డు ప్రదానోత్సవం..ఫలించిన మంత్రి కందుల దుర్గేష్ కృషి..పర్యాటక రంగంలో సత్ఫలితాలిస్తోన్న వినూత్న సంస్కరణలు, విప్లవాత్మక మార్పలు -సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల దిశానిర్దేశంలో పర్యాటక శాఖకు విస్తృత ప్రచారం కల్పించామని పేర్కొన్న మంత్రి కందుల దుర్గేష్ -22 నెలల కాలంలో పర్యాటక రంగంలో మంత్రి కందుల దుర్గేష్ దార్శనికతకు దక్కిన గుర్తింపు..సరికొత్త ప్రచార శైలి, సృజనాత్మక ఆలోచనలతో జాతీయ …

Read More »

రాయలసీమ ఇకపై రక్షణ సీమ

-సీమకు భారీగా డిఫెన్స్ ప్రాజెక్టులు -రూ.15,803 వేల కోట్లతో AMCA ప్రాజెక్టుకు పుట్టపర్తిలో శంకుస్థాపన -డిఫెన్స్, డ్రోన్ రంగాల్లో మరో 12 ప్రాజెక్టులకూ భూమి పూజ -శుక్రవారం రక్షణ మంత్రితో భూమి పూజ చేయనున్న సీఎం చంద్రబాబు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాయల సీమ రతనాల సీమ… ఇది చరిత్ర. ఉద్యాన సీమ… ఇది వర్తమానం. రక్షణ సీమ… ఇది భవిష్యత్. ఇరిగేషన్, హర్టీకల్చర్, స్పేస్, డ్రోన్, సోలార్, విండ్ ఎనర్టీ వంటి రంగాల్లో దూసుకెళ్తున్న రాయలసీమ డెవలప్మెంట్ జర్నీలో మరో …

Read More »

సీఎం చంద్రబాబు వాహన శ్రేణి కుదింపు

-ప్రధాని మోదీ పిలుపుతో కాన్వాయ్ తగ్గించుకున్న ముఖ్యమంత్రి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వాహన శ్రేణిని కుదించుకున్నారు. మొత్తం 12 వాహనాల కాన్వాయ్‌ను 4 వాహనాలకు తగ్గించుకున్నారు. ఇవాల్టి నుంచే ఈ వాహన శ్రేణి కుదింపును అమల్లోకి తీసుకురావాలని సీఎం సూచనలు జారీ చేశారు. ఈ మేరకు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సచివాలయంలో జరిగే కేబినెట్ సమావేశానికి కేవలం నాలుగు వాహనాల కాన్వాయ్‌తోనే సీఎం చేరుకున్నారు. ఇక …

Read More »

రవాణా రంగానికి సహకారంతో పనిచేయాలి…మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

-AP Bus Oparators నూతన కార్యవర్గానికి మంత్రి మండిపల్లి అభినందనలు -రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన బస్ ఆపరేటర్స్ కార్యవర్గ సభ్యులు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని ఏపీ బస్ ఆపరేటర్స్ నూతన కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా ఏర్పడిన కార్యవర్గ సమావేశం అనంతరం ప్రెసిడెంట్ కిరణ్, వైస్ ప్రెసిడెంట్ నాని, కార్యదర్శి రాంబాబు, ట్రెజరర్ సందీప్‌తో …

Read More »

శ్రీవాణి ట్రస్ట్‌లో వైసీపీ పాపాలను కడుగుతున్న కూటమి ప్రభుత్వం

-శ్రీవాణి ట్రస్ట్‌లో దళారుల వ్యవస్థను గుర్తించి, అరికట్టింది కూడా కూటమి ప్రభుత్వమే -వైసీపీ పెద్దలకు హిందూ మతంపై గౌరవం లేదు -ఆలయాల ధ్వంసం తప్ప, వైసీపీ ప్రభుత్వం ఒక్క కొత్త ఆలయాన్ని కూడా నిర్మించలేదు -వైసీపీకి రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం నచ్చటం లేదు -బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రాంప్రసాద్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీవాణి ట్రస్ట్ పేరుతో గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అవకతవకలను కూటమి ప్రభుత్వం బయటపెడుతోందని బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రాంప్రసాద్ పేర్కొన్నారు. టీడీపీ కేంద్ర …

Read More »

అధునాతన విధానాలలో ప్రజారాజధాని అమరావతి నిర్మాణం

– “MIVAN షట్టరింగ్” విధానంలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టులో టవర్ల నిర్మాణం అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతిలో నిర్మాణ పనులు వేగంగా జరిగేందుకు APCRDA అధునాతన విధానాలను అమలు చేస్తోంది. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టులో పలు దేశాలలో అమలులో ఉన్న, నిర్మాణ రంగ నిపుణులు సైతం సూచిస్తున్న “MIVAN షట్టరింగ్” విధానాన్ని నిర్మాణ పనులలో వినియోగించడం ప్రారంభించింది. MIVAN షట్టరింగ్ విధానంలోని ముఖ్యాంశాలు: MIVAN షట్టరింగ్ అనేది ఆధునిక అల్యూమినియం ఫార్మ్‌వర్క్ సిస్టమ్. ఇది ముఖ్యంగా ఎత్తైన భవనాలు, భారీ గృహ నిర్మాణ …

Read More »

APCRDA ఆధ్వర్యంలో ఉచిత లైఫ్ సైన్సెస్ నైపుణ్య శిక్షణ & ఉద్యోగ అవకాశాలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి ప్రాంత యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (APCRDA) మరో కీలక కార్యక్రమాన్ని ప్రారంభించింది. లైఫ్ సైన్సెస్ స్కిల్ సెక్టార్ కౌన్సిల్ సహకారంతో రాజధాని యువతకు ఉచితంగా 3 నెలల నైపుణ్య శిక్షణతో పాటు శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు APCRDA ఉచిత శిక్షణ కార్యక్రమం ప్రారంభించింది. స్వర్ణభారత్ ట్రస్ట్, ఆత్కూరు, కృష్ణా జిల్లాలో జరిగే ఈ శిక్షణ కార్యక్రమం పూర్తిగా ఇండస్ట్రీ స్పాన్సర్డ్‌గా నిర్వహించబడుతోంది. …

Read More »

రైతుల సమస్యలను ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరిస్తాం

-అబ్బరాజుపాలెం గ్రామసభలో APCRDA కమిషనర్ వి.విజయరామరాజు ఐఏఎస్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి నగర నిర్మాణం నిమిత్తం భూసేకరణ కార్యకలాపాలకై అబ్బరాజుపాలెంలో APCRDA ఆధ్వర్యంలో గురువారం గ్రామసభ జరిగింది. నేడు జరిగిన గ్రామసభలో కమిషనర్ వి.విజయరామరాజు ఐఏఎస్, అడిషనల్ కమిషనర్లు ఏ.భార్గవతేజ ఐఏఎస్, కె.కార్తీక్ ఐఏఎస్ హాజరయ్యారు. రాజధాని నగరంలో నిర్మిస్తున్న రహదారులు, LPS జోన్లు, తదితర అభివృద్ధి ప్రాజెక్టుల నిమిత్తం భూసమీకరణ(ల్యాండ్ పూలింగ్- LPS) చేపట్టామని.. సమీకరణకు కొందరు రైతులు, భూయజమానులు ముందుకు రానందున..రైతులతో పలుమార్లు చర్చించిన అనంతరం …

Read More »

జనసేన కేంద్ర కార్యాలయంలో రెండో రోజు జనవాణి – ప్రజల సమస్యల స్వీకరణ

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో కూడా పలువురు ప్రజలు తమ సమస్యలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని త్వరితగతిన పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని ఆయన …

Read More »

రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయానికి అభినందనలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అగ్రిగోల్డ్ సమస్యపై ఈరోజు రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించడం జరిగింది. రెండు నెలల క్రితం అగ్రిగోల్డ్ కస్టమర్స్ & ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరవధిక నిరాహార దీక్షలు జరిగిన సందర్భంగా ఆనాడు ముఖ్యమంత్రి ఆదేశం మేరకు ప్రభుత్వ ప్రతినిధులుగా కుటుంబరావు, వర్ల రామయ్య అగ్రిగోల్డ్ బాధితులకు నిమ్మరసం ఇచ్చి దీక్షలు విరమింప చేశారు. ఈరోజు రాష్ట్ర క్యాబినెట్లో ఆరు మాసాల్లో అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని, మన రాష్ట్రంలో ఉన్న 11.5 లక్షల మందితో పాటు …

Read More »