-పరిశీలనలో ఇంకా 1,11,037 మంది లబ్దిదారులు -పేదలకు ఇళ్ల పేరుతో దోచుకున్న జగన్ సర్కార్ -అందరికీ ఇళ్లు పథకం కింద కొత్తగా 4,08,876 దరఖాస్తుల రాక -శాసనసభలో మంత్రి అనగాని సమాధానం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి: వైసీపీ పాలనా కాలంలో పేదలందరికీ ఇళ్లు పేరుతో 6 వేల కోట్ల రూపాయాల కుంభకోణాలకు పాల్పడ్డారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. మంగళవారం శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ గత ప్రభుత్వం …
Read More »Tag Archives: amaravathi
గుంటూరు ఛానల్ పునరుద్ధరణకు రూ.369 కోట్లు.
-వైసిపి పాలనలో గుంటూర ఛానెల్ వైపు కన్నెత్తి చూడలేదు -శాసనమండలిలో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణ పశ్చిమ డెల్టా, సాగర్ ఆయకట్టులోని మెట్ట ప్రాంతానికి సంబంధించి కొంత భాగానికి కీలకమైన గుంటూరు ఛానల్ పునరుద్ధరణకు కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం శాసనమండలిలో చెప్పారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన స్పష్టమైన వివరణ ఇచ్చారు. 1972లో 27 వేల ఎకరాలకు సాగునీరు, …
Read More »లస్కర్ల వ్యవస్థను చక్కదిద్దుతాం.
-లస్కర్ల సేవలను సమర్ధంగా వినియోగించుకుందాం. -మండలిలో మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నీటిపారుదల రంగ సమర్థ నిర్వహణకు లస్కర్ల వ్యవస్థ చాలా కీలకమని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. శాసనమండలిలో మంగళవారం సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన ఈ విషయం చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్ర వ్యాప్తంగా 7224 మంది లస్కర్ల కు గానూ, 1517 మంది మాత్రమే పని చేస్తున్నారని తెలిపారు. లస్కర్ల పదవీ విరమణ అనంతరం …
Read More »మహిళలు, చిన్నారుల భద్రతకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం
-గంజాయి సాగును పూర్తిగా అరికట్టాము -డ్రగ్స్ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాము -డోర్ డెలివరీ చేసిన వారి కుటుంబ సభ్యుల పై కూడా దృష్టి పెట్టాం..మంత్రి అనిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలు, చిన్నారుల భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఏపీ హోంమంత్రి అనిత ప్రకటించారు. ఎవరైనా ఆడపిల్లల జోలికొస్తే అదే వారికి చివరి రోజు అనే సందేశం ప్రజల్లోకి పంపామని గుర్తుచేశారు. గత రెండేళ్లుగా రాష్ట్రంలో నేరాలు పెరిగాయన్న వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆరోపణలను..శాసనమండలిలో మంత్రి అనిత …
Read More »ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగ కీర్తి కిరీటం విశాఖపట్నం
-శాసనసభ ప్రశ్నోత్తరాల్లో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి -విశాఖ పరిసర ప్రాంత అభివృద్ధికి రూ. 8,650 కోట్ల పెట్టుబడులతో 50 ఒప్పందాలు కుదుర్చుకున్నామని స్పష్టం -హబ్ అండ్ స్పోక్ మోడల్‌లో అంతర్జాతీయ స్థాయిగా విశాఖపట్నంను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్న మంత్రి దుర్గేష్ -సీ-ప్లేన్, క్రూజ్ సర్క్యూట్, హెలీ టూరిజంపై ప్రత్యేక దృష్టి సారించామని వివరణ -విశాఖను అడ్వెంచర్, యాంకర్ హబ్ గా తీర్చిదిద్దుతున్నామని మంత్రి దుర్గేష్ వెల్లడి -విశాఖపట్నం, అమరావతి, తిరుపతిలను మూడు పర్యాటక హబ్ లుగా చేయాలన్నదే తమ లక్ష్యమన్న మంత్రి కందుల …
Read More »గోదావరి జిల్లా ప్రేమ ఆప్యాయతల విందు
– కాకినాడ, అమలాపురం పార్లమెంటు నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు ,కుటుంబసభ్యులతో మంత్రి నారా లోకేష్ ఆత్మీయ కలయిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆత్మీయ ఆతిథ్యానికి చిరునామా అయిన గోదావరి జిల్లా పరిధి కాకినాడ, అమలాపురం పార్లమెంటు కూటమి ప్రజాప్రతినిధులు వారి కుటుంబసభ్యులకు మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో మంగళవారం ఇచ్చిన విందు ప్రేమ ఆప్యాయతలతో సాగింది. గోదావరి జిల్లాలకు వెళితే ఎంత చక్కటి ఆతిథ్యం ఇస్తారో..అదే అతిథి మర్యాదలతో ఆత్మీయ కలయిక ఆనందంగా గడిచింది. గోదావరి జిల్లాకే ప్రత్యేకమైన రుచులు, చిత్రాలు, …
Read More »ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి గొట్టిపాటి రవి కుమార్
మార్కాపురం, నేటి పత్రిక ప్రజావార్త : వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేసి ఉమ్మడి ప్రకాశం జిల్లాను సస్యశ్యామలం చేయడమే సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. తాము అధికారంలో వచ్చిన తరువాత ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్‌లలో నిధుల కేటాయింపే వెలిగొండ ప్రాజెక్టుపై ప్రభుత్వ చిత్తశుద్ధిని నిదర్శనమని మంత్రి స్పష్టం చేశారు. జిల్లాగా ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిసారి మార్కాపురంలో పర్యటించనున్న నేపథ్యంలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ జిల్లాలో పర్యటించారు. …
Read More »ప్రజారాజధాని అమరావతిలో పర్యటించిన నామి ఐలాండ్, సియోల్ జాతీయ యూనివర్సిటీ (దక్షిణ కొరియా) బృందం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు రాష్ట్రాలలో పర్యటిస్తున్న నామి ఐలాండ్, సియోల్ జాతీయ యూనివర్సిటీ(దక్షిణ కొరియా) బృందం సోమవారం ఫిబ్రవరి 23న ప్రజారాజధాని అమరావతిలో పర్యటించింది. పర్యటనలో భాగంగా రాయపూడిలోని APCRDA కార్యాలయాన్ని బృందం సందర్శించింది. ఈ సందర్భంగా అమరావతి అభివృద్ధి గురించి CRDA అధికారులు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అమరావతిలో ప్రణాళికాయుతంగా జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతి, రాజధాని నిర్మాణంలో అమలు చేస్తున్న సమగ్ర మౌలిక వసతుల ప్రణాళికలు, దీర్ఘకాలిక రాజధాని అభివృద్ధి వ్యూహాలు వంటి అంశాలను అధికారులు విదేశీ …
Read More »విటోపియా -2026లో సందర్శకులను ఆకట్టుకున్న “అమరావతి అమ్మవంట” స్టాల్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతిలో మహిళల ఉపాధి అవకాశాలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో APCRDA, అమరావతిలో జరిగే పలు కార్యక్రమాలలో స్థానిక మహిళలకు భాగస్వామ్యం కల్పిస్తోంది. ఇందులో భాగంగా అమరావతిలోని విట్ క్యాంపస్‌లో ఈ నెల 22 నుంచి 23 వరకు మూడు రోజులపాటు జరిగిన “విటోపియా 2026”లో రాజధాని ప్రాంత మహిళలకు స్టాల్ ఏర్పాటు చేసేందుకు కృషి చేసింది. “అమరావతి అమ్మవంట” నేపథ్యం: కమిషనర్ కె. కన్నబాబు, ఐ.ఏ.ఎస్., CRDA సోషల్ డెవలప్‌మెంట్ గ్రూప్ డైరెక్టర్ వెలుగోటి రాములు …
Read More »500కి పైగా ఉద్యోగాల భర్తీకై ఈ నెల 26న తుళ్లూరులో జాబ్ మేళా
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి & శిక్షణ శాఖ, ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(APSSDC) సమన్వయంతో అమరావతి, తుళ్లూరులోని స్కిల్ హబ్ కార్యాలయంలో APCRDA జాబ్ మేళాను నిర్వహిస్తోంది. రాజధాని ప్రాంతంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. ఈ జాబ్ మేళా 26-02-2026 తేదీన ఉదయం 10 గంటల నుండి తుళ్లూరులోని APCRDA స్కిల్ హబ్ కార్యాలయంలో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సాండ్‌స్పేస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, మాస్‌కాఫ్ టెక్నాలజీస్, ECOMAC …
Read More »
Prajavartha Online Telugu News