మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ముడా పరిధిలో కైకలూరు, కృత్తివెన్ను, నాగాయలంక వంటి దూరప్రాంతాల ప్రజలు ఇళ్ల ప్లాన్ల కోసం పడుతున్న ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని 300 గజాలు లోపు మరియు జీ+2010 మీటర్ల ఎత్తు) గృహల నిర్మాణానికి ప్లానుల అనుమతులు ఆయా గ్రామ పంచాయితీ పరిధిలోకి తేవడానికి తీర్మాణం చేయుటకు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. బందరు పోర్టుకు రైలు రోడ్డు కనెక్టివిటి కోసం అవసరమైన 224 ఎకరాలు భూమి సేకరించుటకు సత్వర చర్యలు తీసుకోవాలని మంత్రి అదేశించారు. …
Read More »Tag Archives: machilipatnam
ఈనెల 11న జరిగే జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి – జిల్లా జడ్డి ఏ.నరశింహమూర్తి
-గత ఏప్రిల్ లో జాతీయ లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారంలో రాష్ట్రంలో కృష్ణాజిల్లా మొదటి స్థానం. మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 11వ తేదీ శనివారం జిల్లాలో కోర్టులు గల 13 ప్రదేశాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్డి ఏ.నరశింహమూర్తి వెల్లడించారు. సోమవారం జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా జడ్డి మాట్లాడుతూ సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన జాతీయ లోక్ …
Read More »జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధి, విస్తరణ పనులు వేగవంతం చేయాలి… : మంత్రి పేర్ని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధి, విస్తరణ పనులు వేగవంతం గావించాలని రాష్ట్ర రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాన్ని అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశపు హాలులో జరిగిన జాతీయ రహదారులు, రెవిన్యూ అధికారుల సమన్వయ సమావేశంలో మంత్రి జెసితో కలసి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విజయవాడ, మచిలీపట్నం జాతీయ రహదారి అభివృద్ధికి సంబంధించి ఉయ్యూరు, కంకిపాడు వద్ద అసంపూర్తి పనులు, కత్తిపూడి-ఒంగోలు జాతీయ రహదారి పెండింగ్ పనులు, ఖమ్మం-విజయవాడ మధ్య …
Read More »ప్రభుత్వం ప్రతి ధాన్యపు గింజనూ గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసింది… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసిందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) స్పష్టం చేశారు. సోమవారం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఆయన కలుసుకొని వారితో ముఖాముఖిగా మాట్లాడారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గూర్చి అడిగి తెలుసుకొని ఎన్నో సమస్యలకు మంత్రి పేర్ని నాని అక్కడికక్కడే …
Read More »30.69 కోట్ల రూపాయలు రుణాలు పంపిణీ చేసిన మంత్రి పేర్ని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, డైరెక్టర్లతో కలసి బందరు నియోజకవర్గ పరిధిలో రైతులకు, డ్వా క్రా మహిళలకు 30.69 కోట్ల రూపాయలు రుణాలు పంపిణీ గావించారు. శుక్రవారం స్థానిక రెవెన్యూ కళ్యాణ మండపంలో బందరు నియోజకవర్గ స్థాయిలో రైతులు, డ్వాక్రా మహిళలతో సమావేశం నిర్వహించి రుణాలు పంపిణీ గావించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేడీసీసీ బ్యాంకు ద్వారా రైతులకు, డ్వా క్రా …
Read More »వివిద సమస్యలపై ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన మంత్రి పేర్ని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రవాణా సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) శనివారం తమ కార్యాలయం వద్దకు వివిధ ప్రాంతాల నుండి వివిద సమస్యలపై వచ్చిన ప్రజలను కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకుని అర్జీలు స్వీకరించారు. స్థానిక సర్కిల్ పేటకు చెందిన మహిళ రామాని రాధాకుమారి అనారోగ్యంతో బాధ పడుతున్ననని, ఉన్నత వైద్యం ఇప్పించాలని మంత్రిని కోరగా ఈమెకు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి వైద్య పరీక్షలు చేయించాలని తగిన చికిత్స ఇప్పించాలని మంత్రి తమ సిబ్బందిని ఆదేశించారు. …
Read More »హౌసింగ్ పై సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ జె.నివాస్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని జగనన్న లేఅవుట్ల ఇళ్ల నిర్మాణంపై అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సోమవారం సాయంత్రం, స్థానిక జిల్లాపరిషత్ సమావేశపు మీటింగ్ హాలులో జిల్లా కలెక్టర్, జిల్లాలోని అన్ని మండలాల ఎంపిడిఓలు, ఏఇ. డిఇ, తహసీల్దార్లతో జగనన్న లేఅవుట్లలో నిర్మించే ఇళ్ల నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న లేఅవుట్లలో సకాలంలో ఇళ్ల నిర్మాణం జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సమావేశంలో పాల్గొన్న అధికారులను ఆయన ఆదేశించారు. లబ్ధిదారులతో మీటింగులు ఏర్పాటు చేసి …
Read More »ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అశ్రద్ధ చూపవద్దు… : కలెక్టర్ జె.నివాస్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రజాసమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి గైర్హాజరైన అధికారులపై జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందన కార్యక్రమానికి హాజరుకాని అధికారులందరికీ వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయమని అధికారులను ఆయన ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ప్రజాస్పందన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులతో నిర్వహించారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అశ్రద్ధ చూపవద్దని ఆయన ఈ సందర్భంగా సూచించారు. జిల్లాలోని అసంఘటిత కార్మికుల వివరాలను సేకరించాలని జిల్లా అధికారులకు ఆదేశించారు. …
Read More »స్వామిత్వా ద్వారా పారదర్శకంగా భూలావాదేవీలు : కేంద్ర పంచాయితీరాజ్ జాయింట్ సెక్రటరీ
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్వామిత్వా ద్వారా దళారీ వ్యవస్థకు స్వస్తి పలుకుతూ పారదర్శకంగా, నిష్పాక్షికంగా, అవినీతికి తావు లేకుండా భూలావాదేవీలు, ప్రతి భూభాగానికి విశిష్ట గుర్తింపు సంఖ్య ,భూయజమానులకు తమ భూములపై వేరె ఎవరూ సవాల్ చేయడానికి వీలు కాని శాశ్వత హక్కులు కల్పించడం ద్వారా భూవివాదాలకు స్వస్తి చెప్పినట్లువుతుదని కేంద్ర పంచాయితీరాజ్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అలోక్ ప్రేమ్ నగర్ స్పష్టం చేశారు. బుధవారం మధ్యాహ్నం కేంద్ర పంచాయితీరాజ్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ఆధ్వర్యంలో అయిదుగురు సభ్యుల …
Read More »ధ్రువీకరణ లేని వారి ఆస్తులపై రీ సర్వే ద్వారా హక్కులు… : కలెక్టర్ జె. నివాస్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామంలోని ప్రతి నివాసాన్ని,ఇంటి స్థలాలను రోవర్లతో డిజిటల్ విధానంలో కొలతలు వేశారని, యజమాని వివరాలను కంప్యూటర్లలో నమోదు చేసి..ఇంటి హక్కుల టైటిల్స్ సిద్ధం చేసి ఏళ్లుగా నివాసం ఉంటున్నా ఎలాంటి ధ్రువీకరణలేని వారికీ రీ సర్వే ద్వారా సదరు ఆస్తులపై హక్కులు ఏర్పడతాయని కృష్ణాజిల్లా కలెక్టర్ జె. నివాస్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన మచిలీపట్నం మండల పరిధిలోని పొట్లపాలెం గ్రామాన్ని సందర్శించారు. గ్రామ పంచాయితీ కార్యాలయంలోని రైతుభరోసా కేంద్రం వద్ద ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష’ …
Read More »
Prajavartha Online Telugu News