మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర రవాణా సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) శనివారం తమ కార్యాలయం వద్దకు వివిధ ప్రాంతాల నుండి వివిద సమస్యలపై వచ్చిన ప్రజలను కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకుని అర్జీలు స్వీకరించారు.
స్థానిక సర్కిల్ పేటకు చెందిన మహిళ రామాని రాధాకుమారి అనారోగ్యంతో బాధ పడుతున్ననని, ఉన్నత వైద్యం ఇప్పించాలని మంత్రిని కోరగా ఈమెకు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి వైద్య పరీక్షలు చేయించాలని తగిన చికిత్స ఇప్పించాలని మంత్రి తమ సిబ్బందిని ఆదేశించారు. పెదకానూరు గ్రామానికి చెందిన మహిళ తిరుమాని నాగమణి తన భర్త మరణించారని వితంతు పింఛను మంజూరు చేయించాలని, ఇదే గ్రామానికి చెందిన మరో మహిళ కొక్కిలిగడ్డ భాగ్యలక్ష్మి తన భర్త గత అక్టోబరులో మరణించారని మత్స్యకారుల భీమా మంజూరు చేయించాలని మంత్రిని కోరారు.
స్థానిక నిజాం పేటకు చెందిన మహిళ బత్తుల నెమ్మది బ్రెయిన్ సమస్యతో బాధ పడుతున్నానని ఉన్నత వైద్యం ఇప్పించాలని మంత్రిని కోరారు.
Tags machilipatnam
Check Also
పరిసరాల పరిశుభ్రత మనఅందరి బాధ్యత..పరిశుభ్రతతోనే ఆరోగ్యం…
-పత్రి ఒక్కరిలో స్వచ్ఛత పై అవగాహన కలిగించాలి.. -స్వచ్ఛత-శుభ్రత పై ప్రజలు నైతిక బాధ్యత వహించాలి.. -మురుగు కాలువగట్లపై చెత్తను …