Breaking News

గోశాల సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జె.నివాస్

-కోవిడ్ కేసులు తగ్గుతున్నాయన్న భావనతో వుండకుండా రోజువారి సర్వే నిర్వహించండి..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కోవిడ్ కేసులు తగ్గుతున్నాయన్న భావనతో వుండకుండా రోజువారి ఫీవర్ సర్వే నిర్వహించడంతోపాటు అనుమానితులకు పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆదేశించారు. శనివారం పెనమలూరు మండలం గోశాల గ్రామ సచివాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ వున్న ప్రజలతో మాట్లాడుతూ కోవిడ్ పై పలు విషయాలను తెలియజేశారు. ఒక వ్యక్తి తనకు జూన్లో కోవిడ్ వచ్చిందని తెలపగా ఎలా గుర్తించావని కలెక్టర్ ప్రశ్నించారు. దగ్గు రెండు రోజులు వుండడంతో పరీక్షలు చేయించనన్నారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ త్వరగా గుర్తించడం మూలంగా కోవిడ్ నుంచి కోలుకున్నారన్నారు. అందుకే వాలంటీర్లను రోజువారి ఫీవర్ సర్వే నిర్వహించి నివేదికలు సచివాలయానికి అందించాలని చెప్పడంలో మూలం ఇదేనన్నారు. కేసుని ముందుగా గుర్తిస్తే అవసరమైన పరీక్షలు నిర్వహించి వైద్యం అందించ వచ్చన్నారు. ఫీవర్ సర్వేకి సంబంధించి నివేదికలను సక్రమంగా ఫైలింగ్ చేయాలని మళ్ళీ వారం రోజుల్లో తాను సచివాలయాన్ని సందర్శిస్తానన్నారు. సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలకు సంబంధించి ఏ ఒక్క అంశం పెండింగ్ లో లేకుండా నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరిస్తూ బాధ్యతాయుతంగా విధులను నిర్వహించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు ఏ మేర ప్రజలకు చేరువయ్యాయో సచివాయంలోని సిబ్బంది అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలో ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ క్యాలండర్, ఇతర అంశాలకు సంబంధించిన పోస్టర్లను ప్రదర్శించిన విధానాన్ని ఆయన పరిశీలించారు. ప్రతి రోజు సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో వుంటూ వారికి మెరుగైన సేవలందించాలన్నారు. సచివాలయ సిబ్బంది గ్రామంలోని ప్రజలకు కోవిడ్ నివారణ సూచనలు, వ్యాక్సిన్ వేసుకునేలా అవగాహన పరచాలన్నారు. సచివాలయంలో నిర్వహిస్తున్న వివిధ రిజిస్టర్లను ఆయన పరిశీలించారు. ప్రజలకు సేవలందించడంలో ఏ ఒక్కరూ కూడా జాప్యం, నిర్లక్ష్యం వహించకూడదన్నారు. వీరి వెంట తహాశీల్దార్ భద్రునాయక్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *