Breaking News

Tag Archives: rajamandri

ప్యానల్ న్యాయవాదులు, డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులతో మానిటరింగ్ కమిటీ సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు (గురువారం) తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, రాజమహేంద్రవరం నందు ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి ఎం. మాధురి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్‌ఛార్జ్ కార్యదర్శి బి. పద్మ వారి ఆధ్వర్యంలో ప్యానల్ న్యాయవాదులు, డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులతో మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఫ్యామిలీ కోర్ట్ జడ్జి ఎం. మాధురి వివిధ కేసుల్లో ఉచిత న్యాయ సహాయం అందించేందుకు నియమించబడిన న్యాయవాదులతో ఆయా కేసుల పురోగతి గురించి సమీక్షించారు. …

Read More »

వికాస ఆధ్వర్యంలో – నవంబర్ 1 న జాబ్ మేళా

-కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : “వికాస” ఆధ్వర్యంలో నవంబర్ 1 వ తేదీ శనివారం ఉదయం 9.30 గంటలకు రాజమహేంద్రవరం కలెక్టరేట్ పరిసరాల్లోని “వికాస కార్యాలయం” (బొమ్మూరు హార్లిక్స్ ఫ్యాక్టరీ ఎదురుగా)లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం ఒక ప్రకటన లో తెలియ చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ఉద్యోగాలకు ఎస్‌ఎస్‌సి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణులైన 35 ఏళ్ల లోపు అర్హులైన అభ్యర్థులుకు ఇంటర్వ్యూలు …

Read More »

ప్రతి పేద కుటుంబానికి గృహం లక్ష్యంగా – ప్రభుత్వం సంకల్పబద్ధంగా ముందుకు

-కలెక్టరేట్‌లోడైరెక్టర్ ప్రియా సౌజన్య సమీక్ష రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి స్వంత గృహం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం సంకల్పబద్ధంగా ముందుకు సాగుతోందనీ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్ ప్రియా సౌజన్య పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్ ప్రియా సౌజన్య గురువారం జిల్లా కలెక్టరేట్‌లోని జిల్లా హౌసింగ్ ప్రధాన అధికారి కార్యాలయాన్ని సందర్శించి, గృహ నిర్మాణ సంస్థ పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్. బుజ్జి మరియు …

Read More »

నవంబర్ 7 శుక్రవారం రెడ్‌క్రాస్ జిల్లా కమిటీ ఏర్పాటు సమావేశం

-కలెక్టర్ కీర్తి చేకూరి అధ్యక్షతన నిర్వహణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నవంబర్ 7వ తేదీ (శుక్రవారం) ఉదయం 10.30 గంటలకు, కలెక్టర్ కార్యాలయం ధవళేశ్వరంలోని PGRS హాల్‌లో రెడ్‌క్రాస్ జిల్లా కమిటీ ఏర్పాటు సమావేశం జరుగనున్నట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రెడ్‌క్రాస్ శాఖలో సభ్యత్వం కలిగిన పేట్రాన్, వైస్ పేట్రాన్, లైఫ్ మెంబర్స్ మరియు లైఫ్ అసోసియేట్ సభ్యులు అందరికీ తెలియజేయున దేమనగా, ఈ సమావేశంలో ఇండియన్ …

Read More »

గోకవరం మండలంలో కలెక్టర్ విస్తృత పర్యటన

-వ్యవసాయ, హార్టికల్చర్ పంట నష్టం ఎన్్యూమరేషన్ పనులు వేగవంతం చేయాలి -సకాలంలో నివేదిక అందచేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాలు గోకవరం / రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మొంథా తుఫాను ప్రభావంతో నష్టపోయిన పంటల వివరాలు పూర్తి స్థాయిలో అంచనా వేసే క్రమంలో జిల్లా అధికారులు మండల, గ్రామ స్థాయి సిబ్బందితో పరస్పర సమన్వయంతో నష్టం అంచనా నివేదిక సమగ్రంగా సిద్ధం చేసి, సకాలంలో సమర్పించాలని కలెక్టర్ కీర్తి చేకూరి తెలియ చేశారు. మొంథా తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాలను జిల్లా …

Read More »

ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి…

నిడదవోలు/ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ‘మొంథా’ తుఫాన్ ప్రభావం దృష్ట్యా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని నిడదవోలు తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి సూచనలు అందజేసిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. ప్రజల భద్రతను ప్రాధాన్యంగా తీసుకుని, అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, తాగునీటి సరఫరా, విద్యుత్, రవాణా, వైద్య సేవలు వంటి అత్యవసర సేవలకు ఎటువంటి అంతరాయం కలగకుండా సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. …

Read More »

‘మొంథా’ తుపాను దృష్ట్యా ప్రజలను అప్రమత్తం చేయండి

-ఫోన్ కాల్ ద్వారా జిల్లా కలెక్టర్ కు మంత్రి కందుల దుర్గేష్ సూచన -ఎర్రకాలువ ముంపు గురికాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, పంట నష్టపోకుండా రైతాంగానికి మార్గదర్శకత్వం అందించాలని మంత్రి దుర్గేష్ ఆదేశాలు జారీ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం: ‘మొంథా’ తుఫానును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఈ సందర్భంగా “మొంథా” తుఫాన్ పై ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి కందుల దుర్గేష్ ఫోన్ కాల్ ద్వారా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరికి సూచించారు. …

Read More »

గోదావరి నది తీర మండలాలు, లోతట్టు గ్రామాలు అప్రమత్తంగా ఉండాలి

-వర్షాల నేపథ్యంలో జిల్లాలోని అన్ని విభాగాలు అధికారులు , సిబ్బంది సిద్ధంగా ఉండాలని సూచనలు -కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : దక్షిణ తూర్పు అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర ఆవర్తనం (Depression) మరియు తమిళనాడు తీరానికి సమీపంగా దక్షిణ పశ్చిమ బంగాళాఖాతంలో కొనసాగుతున్న బలమైన తక్కువ పీడన ప్రాంతం (Well Marked Low Pressure Area) కారణంగా వచ్చే 24 గంటల్లో వాతావరణంలో మార్పులు, వర్షపాతం తీవ్రత పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ జారీ చేసిన …

Read More »

జిల్లాలో 96 పాఠశాలల్లో ఆధార్ బయోమెట్రిక్ నవీకరణ ప్రత్యేక శిబిరాలు – 23 నుండి 30 అక్టోబర్, 2025

-5 నుంచి 17 ఏళ్ల మధ్య వయసు వారు సద్వినియోగం చేసుకోవాలీ -కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : UIDAI ఆదేశాల ప్రకారం, అక్టోబర్ 23 నుంచి 30 వరకు తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 96 పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ బయోమెట్రిక్ శిబిరాలు నిర్వహించ నున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 5–17 ఏళ్ల వయస్ ఉన్న పిల్లలకు ఉచితంగా బయోమెట్రిక్ నవీకరణ జరగనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ …

Read More »

వ్యాపార అభివృద్ధి & బ్యాంక్ లింకేజ్ పై సమీక్ష సమావేశం

– మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ టీ. కనకరాజు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అమృత గోదావరి మరియు రాజమహేంద్రి TLFలలో వ్యాపార అభివృద్ధి, నూతన వ్యాపార ఏర్పాట్లు మరియు SHG సభ్యుల సౌకర్యాలను పెంపొందించేందుకు స్థానిక మెప్మా కార్యాలయంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ టీ. కనకరాజు LHP సెల్ ద్వారా కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, ఇప్పటికే ఉన్న వ్యాపారాలను మరింత అభివృద్ధి పరచడానికి, SHG, ముద్ర, SEP, PMEGEP, PMFME పథకాల ద్వారా లోన్స్ …

Read More »