– ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను సందర్శించిన కలెక్టర్ లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ బుధవారం ఇబ్రహీంపట్నం మండలం, కొండపల్లిలోని కొండపల్లి బొమ్మల ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను సందర్శించారు. ఇటీవల నిర్వహించిన కొండపల్లి బొమ్మల ఉత్సవం ఘన విజయం సాధించిన నేపథ్యంలో హస్తకళాకారులు సరికొత్త ఉత్సాహంతో వినూత్న డిజైన్లతో కళాత్మక వైభవాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో నిరంతర పర్యవేక్షణ, కళాకారులను ప్రోత్సహించే క్రమంలో కలెక్టర్ లక్ష్మీశ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను సందర్శించి, కళాకారులతో ముచ్చటించారు. సంప్రదాయ కళను ఆధునికతతో మేళవిస్తూ …
Read More »Tag Archives: vijayawada
పెనుగంచిప్రోలులో మజ్జిగ పంపిణీ కార్యక్రమం
పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : పెనుగంచిప్రోలు మండలంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్, పెనుగంచిప్రోలు బ్రాంచ్ ఆధ్వర్యంలో, చైర్మన్ నెట్టెం రఘురాం ఆదేశాల మేరకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు చల్లని మజ్జిగ పంపిణీ చేయడం ద్వారా ఉపశమనం కలిగించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యంగా నిలిచింది. ఈ సేవా కార్యక్రమం ద్వారా కేడీసీసీ బ్యాంకు తమ సామాజిక బాధ్యతను మరొకసారి చాటుకుంది. రాబోయే రెండు మూడు రోజుల్లో ఉమ్మడి జిల్లాలోని …
Read More »ముఖ్యమంత్రి పర్యటనకు శరవేగంగా ఏర్పాట్లు
– కార్యక్రమం విజయవంతానికి అధికారులు సమష్టిగా కృషిచేయాలి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 9వ తేదీన ఎ.కొండూరు మండలం మాధవరంలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని.. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో కృషిచేయాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం స్థానిక స్వర్ణ గ్రామం కార్యాలయంలో కలెక్టర్ లక్ష్మీశ, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ.. ముఖ్యమంత్రి కార్యక్రమాల …
Read More »“తాలీమ్-ఎ-హునర్ (వక్ఫ్ ఎడ్యుకేషన్ మిషన్)” కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి తెలియజేయునదేమనగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు వారు, మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, ఆర్థికంగా వెనుకబడిన ముస్లిం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించుటకు “తాలీమ్-ఎ-హునర్ (వక్ఫ్ ఎడ్యుకేషన్ మిషన్)” అనే ప్రతిష్టాత్మక విద్యా కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకి కాకూడదనే ప్రభుత్వ లక్ష్యంతో ఈ కార్యక్రమం రూపొందించబడింది. ఈ పథకం ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో 100% ఉచిత రెసిడెన్షియల్ ఇంటర్మీడియట్ విద్యతో పాటు IIT-JEE, …
Read More »ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 50వ రోజు కొనసాగుతున్న యూత్ టైం బ్యాంక్ సేవలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా ఐఏఎస్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యూత్ టైం బ్యాంక్ సేవలు 50వ రోజు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో నిర్విరామంగా కొనసాగుతున్నాయని యువజన సర్వీసుల సంక్షేమ శాఖ ముఖ్య కార్యనిర్వాహణాధికారి మరియు ఎన్ఎస్ఎస్ జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ కొల్లేటి రమేష్ తెలిపారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో సిబ్బంది కొరత రీత్యా యూత్ టైం బ్యాంక్ సర్వీసులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టితో మార్చి 16వ తేదీన ప్రారంభించారు. …
Read More »“యూ ట్యూబ్” న్యూస్ చానెళ్ల జర్నలిస్టులకోసం కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో “యూ ట్యూబ్” న్యూస్ చానెళ్లు నిర్వహిస్తున్న వారి వివరాలు సేకరిస్తున్నట్లు సి.ఆర్. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీ ఆలపాటి సురేశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో ప్రింట్,ఎలెక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు గానే, “యూ ట్యూబ్” న్యూస్ చానెళ్ల జర్నలిస్టులకోసం కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అందు కోసం జిల్లాల వారీగా “యూ ట్యూబ్” న్యూస్ చానెళ్లు యజమానులు తమ వివరాలుదిగువ పేర్కొన్న మెయిల్ ఐ.డి.కు, లేదా చిరునామాకుపంపాలనికోరారు. …
Read More »విజయవాడ ఆర్‌డీవోగా వెన్నెల శ్రీను
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నూతన రెవెన్యూ డివిజనల్ అధికారిగా (ఆర్డీవో) వెన్నెల శ్రీను బుధవారం నగరంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశను కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ.. రెవెన్యూ సేవలతో పాటు ప్రజలకు అత్యంత పారదర్శకంగా పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు అందించడంలో ప్రత్యేక ముద్ర వేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలయ్యేలా క్షేత్రస్థాయి అధికారులను సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వర్తించాలని …
Read More »ఇంటి గోడపై జనాభా లెక్కల గుర్తులు, అంకెలు వేయుటకు సహకరించండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో జనగణన కార్యక్రమం మే 4, 2026 నుండి పూర్తి స్థాయిలో కొనసాగుతోందని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, జనాభా లెక్కల సేకరణను ప్రశ్నోత్తరాల రూపంలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 51,055 మంది ప్రజల వివరాలను నమోదు చేసినట్లు తెలిపారు. జనగణన ప్రక్రియను మరింత వేగవంతంగా, సమర్థవంతంగా పూర్తి చేయుటకు …
Read More »నగరంలోని వాడుక నీరుని పూర్తిస్థాయిలో శుద్ధి చేసేలా చర్యలు
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని వాడుక నీరుని పూర్తిస్థాయిలో శుద్ధి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని తమ చాంబర్ వద్ద గల సమావేశపు గదిలో యూనిడో ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యూనిడో నిధులతో చేపట్టిన రామలింగేశ్వర నగర్ లో 20 యం ఎల్ డి సామర్థ్యం గల సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ మరియు సింగనగర్, జక్కంపూడి, …
Read More »సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త నియమావళి ప్రకారం నగరంలోని నాలుగు రంగుల చెత్తబుట్టలను ఏర్పాటు చేయండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త నియమావళి ప్రకారం నగరంలోని నాలుగు రంగుల చెత్తబుట్టలను ఏర్పాటు చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని తమ చాంబర్ వద్ద గల సమావేశపు గదిలో శాఖధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యర్థ పదార్థాల నిర్వహణ 2026 నియమావళి ప్రకారం, నగర పరిధిలో గల మూడు చెత్తబుట్టలను నాలుగు చెత్త బుట్టలుగా చేయాలని, …
Read More »
Prajavartha Online Telugu News