Breaking News

దేశానికే తలమాణికం సెంటర్ అఫ్ ఎక్సలెన్సి, కుప్పం

-హార్టికల్చర్ హబ్ లో విదేశీయులకు శిక్షణ

కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త :
దేశానికే తలమాణికం సెంటర్ అఫ్ ఎక్సలెన్సి(సి ఓ ఈ), కుప్పం అని, ఇజ్రాయిల్ టెక్నాలజీ తో మొట్టమొదటి సారిగా కుప్పంలో ఏర్పాటు నూతన వంగడాల ప్రయోగాల్లో దూసుకెళ్తోందని ఎం ఎల్ సి కంచెర్ల శ్రీకాంత్ తెలిపారు. మంగళవారం కుప్పం లోని హార్టికల్చర్ హబ్ లో రాష్ట్ర ప్రభుత్వం – హార్టికల్చర్ మిషన్- ఇండో ఇజ్రాయిల్ ఎంబస్సే న్యూ ఢిల్లీ వారి సహకారం తో, ఉద్యాన శాఖ లో శాస్త్రీయ సాంకేతిక పద్ధతుల్లో రంగంలో మల్చింగ్,డ్రిప్, సాగు పద్ధతులు మరియు నర్సరీ లలో, పాలి హౌసెస్ లో మొక్కలు అంటు కట్టే విధానం, పంటల సాగు విధానం, సస్యరక్షణ అంశాలపై 12 రాష్ట్రాలకు చెందిన 40 మంది ప్రభుత్వ ఉద్యాన శాఖ అధికారులకు డిసెంబర్ 3 నుండి డిసెంబర్ 5 వరకు నిష్ణాతులైన శిక్షకులచే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కార్య క్రమాలు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు అయిన మంగళ వారం ఈ అవగాహన కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమము లో ఇండో ఇజ్రాయిల్ ఎంబస్సి న్యూ ఢిల్లీ,అగ్రికల్చర్ అటాచి (ప్రతినిధి) ఉరీ రూబీన్ స్టీన్,ప్రాజెక్ట్ ఆఫీసర్ బ్రహ్మదేవ్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి మధుసూదన్ రెడ్డి జిల్లా ఏపీఎంఐపి అధికారి బాలసుబ్రమణ్యం, హార్టికల్చర్ ఏడి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ…విదేశీయుల బృందం కుప్పం లోని హార్టికల్చర్ హబ్ లో పరిశోధనలు చేసేందుకు రావడంతో తాము సాధించిన పెద్ద విజయం అని అన్నారు. మూడు రోజులుగా విదేశీయులు కుప్పం సెంటర్ అఫ్ ఎక్సలెన్స్ లో శిక్షణ పొంద నున్నారని, ముఖ్య మంత్రి గారి దూర దృష్టితో ఆలోచించి మారుమూల ప్రాంతంలో విదేశీ పరిజ్ఞానంతో హార్టికల్చర్ హబ్ ను ఏర్పాటు చేసారని, ఇక్కడ వివిధ రకాల నూతన వంగడాలు సృష్టించి జాతీయ స్థాయిలో హార్టికల్చర్ హబ్ ను నిలబెట్టారని కొనియాడారు. కుప్పంలో ఒకప్పుడు ఒకే రకమైన మూస పద్దతిలో పంటలు పండించే వారని అలాంటి వారు ఇప్పుడు బహుళ పంటలు పండిస్తూ మంచి ఆదాయం పొందు తున్నారనన్నారు. రైతుల కోసం ఎన్నిరకాల ప్రయోగాలు చేసేందుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందనన్నారు. అదే విధంగా తొందరలోనే విద్యార్థులు కూడా శిక్షణ తీసుకునేలా కార్యక్రమాలు రూపొందిస్తామని, హార్టికల్చర్ యూనివర్సిటీ కూడా కుప్పంకి తీసుకొచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. భవిష్యత్ లో అభివృద్ధి ని దృష్టి లో పెట్టుకొని కుప్పం ప్రాంతం తో పాటు ఇతర ప్రాంతాల్లో పండించే కూరగాయలతో పాటు పండ్లు, పూలు ఇతర ప్రాంతాలకు తరలించుకునేందుకు వీలుగా కుప్పంలో విమానాశ్రయం ఏర్పాటుకి అన్ని ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని పనులు ప్రారంభించేందుకు కృషి చేస్తామన్నారు. అదే విధంగా సెంటర్ అఫ్ ఎక్సలెన్స్ లో ఒక మొక్కకు ఇతర మొక్కలు అంటుకట్టి పంటలు పండించే విధానం చాలా ఆశ్చర్యంగా ఉందని, దాంతో పాటు రైతులకు అన్ని విధాలా సహకారాలు అందించేందుకు ఫుడ్ ప్రాసేసింగ్ యూనిట్స్ కూడా వస్తున్నాయని మరిన్ని నూతన వంగడాలు అభివృద్ధి చేసేందుకు కృషి విజ్ఞాన కేంద్రం కూడా కుప్పంలో ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. రైతులు ఒకే విధానాన్ని పాటించకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు సాధించే విధంగా చూసేందుకు అన్ని విధాలా ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు. అదే విధంగా వివిధ దేశాల నుండి వచ్చిన ప్రతినిధులకు తాము అవలంభిస్తున్న పద్ధతులను హార్టికల్చర్ అధికారులు వివరించారు.

ఈ కార్యక్రమంలో నాయకులు సురేష్ బాబు,విదేశీ ప్రతినిధులు, హార్టికల్చర్ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *