యువతిపై కత్తిదాడి ఘటన…

-నిందితుడిని వెంటనే అరెస్టు చేయండి
-ఇన్చార్జి ఎస్పీకి మంత్రి సవిత ఆదేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కడప జిల్లా వేముల మండలం కొత్తపల్లిలో యువతిని అతి కిరాతకంగా కత్తితో దాడి చేసిన ఉన్మాది కుళాయప్పను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఇన్చార్జి ఎస్పీ విద్యాసాగర్ నాయుడును జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్.సవిత ఆదేశించారు. ప్రేమించాలంటూ యువతిపై ప్రేమోన్మాది దాడి చేసిన విషయం తెలిసిన వెంటనే ఇన్చార్జి ఎస్పీతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. పరారీలో ఉన్న నిందితుడిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత యువతికి మెరుగైన వైద్యమందించాలని ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు. యువతికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని, నిందితుడు ఎంతటివాడైనా విడిచిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి సవిత స్పష్టం చేశారు. ఈ మేరకే మంత్రి క్యాంపు కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుల చేసింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *