Breaking News

పిఎంసి కేంద్రీయ విద్యాలయ నెంబర్‌వన్‌లో వార్షిక క్రీడా దినోత్సవం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
క్రీడలు జీవితంలో అంతర్భాగంగా మలుచుకొని ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని భవిష్యత్తులో భారతదేశం తరుపున ప్రాతినిధ్యం వహించేలా అభివృద్ధి చెందాలని డిఆర్‌ఎం నరేంద్ర ఎ పాటిల్‌ ఆకాంక్షించారు. గురువారం పిఎంసి కేంద్రీయ విద్యాలయ నెంబర్‌ వన్‌లో జరిగిన 37వ వార్షికోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రిన్సిపల్‌ ఆదిశేష శర్మ స్వాగత ఉపన్యాసం చేయగా వ్యాయామ ఉపాధ్యాయుడి టి.ఏడుకొండలు వార్షిక నివేదిక సమర్పించారు ముఖ్య అతిథి నరేంద్ర ఎ పాటిల్‌ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలో రాణించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని విద్యాలయంలో క్రీడాకారులు భవిష్యత్తులో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదగాలని ఆకాంక్ష తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు పిరమిడ్‌లో విద్యార్థులు
టైక్వాండోలతో సహా పలు సాంస్కృతిక క్రీడా విన్యాసాలను ప్రదర్శించారు. విద్యార్ధినీ విద్యార్ధులు మార్చ్‌ పాస్ట్‌ చేసి తమ ప్రతిభను ప్రదర్శించారు. జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన విద్యార్థినీ విద్యార్థులు ఆస్తిక్‌ (ఆర్చరీ), ధీరజ్‌ (స్కేటింగ్‌), శ్రీఅంసీత (అర్చరీ), అభిరామ్‌ (స్కేటింగ్‌), ఈక్షిత (స్కేటింగ్‌), లక్ష్మీనారాయణ (స్కేటింగ్‌), జాన్సన్‌ (స్విమ్మింగ్‌), మనోహర్‌ (స్కేటింగ్‌)లను అభినందించారు. ఈ సందర్భంగా విఎంసి సభ్యులు డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ మరియు రైల్వే డిపార్ట్మెంట్‌ ఏపీవో అనిరుద్‌ విద్యార్థిని విద్యార్థుల్ని అభినందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *