Breaking News

రెండో రోజూ కలెక్టర్ల సదస్సులో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం (అమరావతీ), నేటి పత్రిక ప్రజావార్త :
ఆక్వా ఉత్పత్తుల సాగు పద్ధతులు, వినియోగం, మార్కెటింగ్, ల్యాండ్ కన్వర్షన్ తదితర అంశాలపై, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, యువతకు ఆయా విభాగాల్లో నైపుణ్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవడం పై దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ పి . ప్రశాంతి కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో వివరించారు. గురువారం వెలగపూడి లో రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన నిర్వహించిన రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ల సదస్సులో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రెండో రోజూ కూడా పాల్గొనడం జరిగింది.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ,  లోతట్టు ప్రాంతాలలో ముంపు ప్రాంతాల్లో రైతులు, దిగుబడి తక్కువగా వస్తున్నట్లు తెలిపారు. ఆయా భూముల్లో పి హెచ్ శాతం తగ్గడం వల్ల, ఏడాదికి ఏడాదికి దిగుబడి తగ్గుతున్న దృష్ట్యా భూ యజమానులు ఆక్వా సాగు చేసేందుకు ల్యాండ్ కన్వర్షన్ కోసం కోరడం జరుగుతున్నట్లు తెలిపారు.  ఆక్వా కల్చర్ అభివృద్ది సామర్ధ్య రంగాలలో ప్రభుత్వ పరంగా చేయూత నివ్వడం పై దృష్టి పెట్టాల్సి ఉంటుందని తెలియ చేశారు. అదే ప్రవేటు పరంగా సహారం కోరే వ్యక్తులు, సంస్థలు 20 వేలు నుంచి 25 వేల రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పరంగా చేయూత నివ్వడం ద్వారా రైతులకి ప్రయోజనం చేకూర్చ గలుగుతామన్నారు. ఆ దిశలో యువతలో నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని, ఆర్ట్స్ కళాశాల విద్యార్థులకు అకడమిక్ బోధన తో పాటు నైపుణ్య శిక్షణ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలో రెండు మూడు బ్యాచ్ లని తయారు చేయడం ద్వారా ఉభయ గోదావరీ జిల్లాల నుంచి వస్తున్న డిమాండ్ కు అనుసరించి నైపుణ్యం గల వ్యక్తుల్ని అందుబాటులోకి తీసుకుని రావడం సాధ్యం అవుతుందని కలెక్టరు ప్రశాంతి వివరించారు. ఇందుకు సమాంతరంగా  ఆక్వా కల్చర్ కు తగిన అంతర్జాతీయ మార్కెటింగ్ ప్రోత్సహం అందించడానికి, ధరల స్థిరీకరణ విధానం పై దృష్టి పెట్టాల్సి ఉంటుందన్నారు. ముఖ్యంగా రొయ్యేల ఉత్పత్తుల వినియోగం పై దృష్టి సారించడం వలన ఎంతో మేలు చేకూరుతుందని వివరించారు.

రానున్న 2027 గోదావరీ పుష్కరాలు నేపథ్యంలో జిల్లాలో ప్రతిపాదించిన పలు అభివృద్ది కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలు కల్పించడం తదితర అంశాలపై కలెక్టరు వివరించడం జరిగింది.

శ్రీ సత్యసాయి బాబా ట్రస్టు అధ్వర్యంలో నిర్వహిస్తున్న తాళ్లపూడి మండలం కు త్రాగునీటి సరఫరా చేసే సత్యసాయి ట్రస్టు సిబ్బందికి వేతనాలు చెల్లింపు, పిఎఫ్ తదితర అంశాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని రావడం జరిగింది. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన పలు మెట్ట ప్రాంతం మండలాలకు గత రెండు దశబ్దాలుగా తాగునీరు అందించడం జరుగుతోందన్నారు. సకాలంలో 2021 నుంచి జీతాలు చెల్లింపు జరగ పోవడం సిబ్బంది సమ్మె దిశగా అడుగులు వేయడం జరుగుతోందన్నారు. సిబ్బంది సంఖ్య విషయములో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నిధుల విడుదల చెయ్యాలని విజ్ఞప్తి చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *