Breaking News

ప్రభుత్వ హౌసింగ్ లే అవుట్ మౌలిక సదుపాయాలు కల్పించాలి  కలెక్టరు ప్రశాంతి

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ లే అవుట్ లలో మౌలిక సదుపాయాలు కల్పించడం కు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. శనివారం సాయంత్రం కొవ్వూరు స్పెక్ లేఅవుట్ లో ప్రభుత్వం పంపిణి చేసిన ఇండ్ల స్థలాలలో గృహా నిర్మాణ పనులు చేపట్టడం, లే అవుట్ లో మౌలిక సదుపాయాలు పై క్షేత్ర స్థాయిలో పరిశీలన చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి గృహ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం గృహ నిర్మాణాల కోసం అందచేస్తున్న ఆర్ధిక చేయూత నివ్వడం తో పాటు స్వయం సహాయక సంఘాల మహిళలు అదనపు ఋణ సౌకర్యం కల్పించడం జరుగుతోందని అన్నారు. ఆమేరకు బ్యాంకర్ల తో మాట్లాడడం జరిగిందనీ తెలిపారు. ప్రభుత్వ లే అవుట్ లో నీటి వసతి, రహదారులు, శానిటేషన్ నిర్వహణ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. మునిసిపల్ కమిషనర్ తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కలెక్టరు వెంట ఆర్డీవో రాణి సుస్మిత, హౌసింగ్ ఇన్చార్జి పిడి, కే ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటి కలెక్టరు ఎస్ భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *