Breaking News

కోల్డ్ స్టోరేజ్ లకు కచ్చితంగా ఫైర్ సేఫ్టీ మెషర్స్ ఉండాలి

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మంగో మార్కెట్లో ఉన్న షాపులన్నిటికీ ట్రేడ్ లైసెన్సులు ఉండాలని కోల్డ్ స్టోరేజ్ లకు ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఉండాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం కేదారేశ్వరపేట ప్రాంతంలో ని మాంగో మార్కెట్ అధికారులతో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మాంగో మార్కెట్లో ఉన్న షాపులన్నీ పరిశీలించారు అక్కడున్న కోల్డ్ స్టోరేజ్లకు కచ్చితంగా ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఉండాలని ఆదేశించారు. ఒక నెల గడువు ఇచ్చి ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ కచ్చితంగా తీసుకోవాలని షాప్ యజమానులను ఆదేశించారు. మార్కెట్ నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని అక్కడ కల్పించాలని వారికి చెప్పారు. మంగో మార్కెట్ కి వచ్చే వాహనాల వల్ల ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీస్ తో అన్నారు. ఈ పర్యటనలో కమిషనర్ తో పాటు ఇంచార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మల్యాద్రి, రీజినల్ ఫైర్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ రాజా పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *