-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ వైద్యశాలలో మరిన్ని వసతులను పెంచమని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం ముత్యాలంపాడు, జింఖాన, హనుమాన్ పేటలో ఉన్న విజయవాడ నగరపాలక సంస్థ వారి వైద్యశాలలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేవలం పర్యటించిన ప్రదేశాలలోనే కాకుండా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల వైద్యశాలలలో ఎటువంటి మరమ్మతులు ఉన్న వెంటనే మరమ్మతులు చేయించాలని వసతులు మరిన్ని పెంచమని ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని అన్నారు. ఈ పర్యటనలో కమిషనర్ తో పాటు ఇంచార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బాబా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News