Breaking News

సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

– వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కొత్త ఆశలు, ఆకాంక్షలతో 2025 లోకి అడుగు పెడుతున్న సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2024 ఏడాదిలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని నూతన ఏడాదిలో మరింత పట్టుదల, కృషితో సవాళ్లను అధిగమించి ప్రజలందరూ విజయాలను కైవసం చేసుకోవాలని ఆకాంక్షించారు. నూతన లక్ష్యాలను చేరుకోవడానికి, కొత్త అవకాశాలను అన్వేషించడానికి 2025 సంవత్సరం స్ఫూర్తిని ఇవ్వాలని కోరుకున్నారు. ఈ కొత్త సంవత్సరం ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, ఐశ్వర్యాన్ని తీసుకువచ్చే ఏడాది కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఆనందం నింపే సంవత్సరంగా 2025 గుర్తుండిపోవాలని కోరుకుంటూ.. ప్రజలందరికీ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *