Breaking News

సంపద సృష్టించడానికి మార్గాలు తెలిసిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు

-6,7 డివిజన్లల్లో రూ.30 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌
-లబ్ధిదారులకు ఫించన్లు స్వయంగా అందచేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సంపదను సృష్టించి దాని ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజా సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయగల ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు.
మంగళవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 6,7 డివిజన్ల పరిధిలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ పర్యటించి స్థానికంగా ఉన్న సమస్యలను అక్కడి నివాసితులను అడిగి తెల్సుకున్నారు. 6వ డివిజన్‌లో ఆంజనేయ స్వామి గుడి నుంచి గంగానమ్మ గుడి వీధి వరకు కొండ ప్రాంతంలో రూ.8.17 లక్షల అంచనా వ్యయంతో మెట్లు, రైయిలింగ్‌ నిర్మాణ పనులకు, రూ.8.46 లక్షల అంచనా వ్యయంతో గంగానమ్మ గుడి దగ్గర మెట్లు నిర్మాణ పనులకు, రూ.6.20 లక్షల అంచానా వ్యయంతో చేపట్టిన తోట నారాయణరావు వీధి కొండ ప్రాంతంలో మెట్లు, రెయిలింగ్‌ ఏర్పాటు పనులకు, రూ.5.20 లక్షల అంచానా వ్యయంతో ఏడో డివిజన్‌ పరిధిలోని బోయపాటి మాధవరావు రోడ్డులోని శానిటరీ కార్యాలయం వెనుక రోడ్డులో యూజీడీ పైపుల అమర్చే పనులకు ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం ఫించన్ల లబ్ధిదారులకు ఫించన్ల సొమ్మును ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ అందచేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ దేశంలోనే ఏ జాతీయ, ప్రాంతీయ పార్టీకి లేనంత బలం టీడీపీకే ఉందని ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా రుజువు అయ్యిందన్నారు. ఇప్పటికే 91 లక్షలకు పైగా సభ్యత్వాలు నమోదు అయ్యాయని అన్నారు. లక్ష రూపాయలు చెల్లించి జీవిత కాల సభ్యత్వాలను కూడా తీసుకుంటున్నారని చెప్పారు. యూనియన్‌ బ్యాంక్‌ ఉద్యోగులందరూ తనను కలిసి ఒక వ్యక్తిని ప్రతిని«ధిగా ఎన్నుకుని లక్ష రూపాయాలు చెల్లించి అతనికి జీవిత కాల సభ్యత్వాన్ని నమోదు చేయించారని, బ్యాంకు ఉద్యోగులందరూ వారికి ఏసమస్య వచ్చిన ఆ వ్యక్తి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించుకునేలా అతను కృషి చేస్తారని చెప్పారు.

రోజుకు కోటి రూపాయలతో అభివృద్థి పనులు
తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోజుకు సుమారు కోటి రూపాయల వ్యయానికి తగ్గకుండా నియోజకవర్గంలో వివిధ అభివృద్థి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. రూ.3 కోట్ల 75 లక్షల అంచనా వ్యయంతో ఆటోనగర్‌లో వాహనాల రాకపోకలకు వీలుగా రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభిస్తున్నామని చెప్పారు. సంక్షేమాన్ని, అభివృద్థిని సమాంతరంగా అందచేస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు లక్ష్యమని చెప్పారు. ఫించన్లను ఇంటింటికి వెళ్ళి అందచేశామన్నారు. ఇంకా చాలా మందికి ఫించన్లు కొత్తగా మంజూరు కావాలని, త్వరలోనే వారికి కూడా ఫించన్లు అందచేస్తామన్నారు. లక్షా ఎనభై ఆరు వేల కోట్లుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పీపీపీ విధానంలో పెద్ద ప్రాజెక్టును తీసుకురానున్నారని చెప్పారు. ఆ ప్రాజెక్టు పూర్తి అయితే వేల కోట్ల ఆదాయం రాష్ట్ర ఖజానాకు జమ అవుతుందన్నారు. సంపద సృష్టించడానికి మార్గాలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. సంపదను సృష్టించి పేదలకు పంచి వారిని అభివృద్థి చేయడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు లక్ష్యమని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు.
ఈ కార్యక్రమంలో డివిజన్‌ అధ్యక్షులు పడాల గంగాధర్, పటమట సతీష్‌ పల్లి దుర్గాప్రసాద్, దోమకొండ అశోక్, నాగుమోతు రాజా, పునుగుపట్టి మోహనరావు, పెనుగొండ శ్రీనివాస్, పటాన్, మధర్‌ , దోమకొండ రవి ,బి. బువ్వమ్మ, కండబూతు కాంతమ్మ, వడ్డేపల్లి కేశవ, మజ్జి రామానాయుడు, కోట శివలక్ష్మి,షేక్ షకీలా, సోము నాయుడు, పడాల వాసు, చంద్ర , దోమకొండ రత్నాకర్, పరసా లక్ష్మణ్, , పెరవల శివ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *