Breaking News

కడప జిల్లా పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి

రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త :
కడప జిల్లా పర్యటన నిమిత్తం నేటి బుధవారం రాత్రి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న గౌ. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి డా. జితేంద్ర సింగ్ గారికి సాదర స్వాగతం లభించింది. కడప ఆర్డీవో జాన్ ఇర్విన్, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి ఇమ్రాన్, పిసి రాయుడు తదితరులు కేంద్ర సహాయ మంత్రికి సాదర స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అనంతరం కేంద్ర సహాయ మంత్రి రోడ్డు మార్గాన కడపకు బయలుదేరి వెళ్లారు. రేపు కడప జిల్లా కార్యక్రమాలలో పాల్గొని మూడవ తేదీ రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త నియమావళి ప్రకారం నగరంలోని నాలుగు రంగుల చెత్తబుట్టలను ఏర్పాటు చేయండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *