గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సంస్థాగత సామాజిక బాధ్యతగా, ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ప్రజల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు నిరంతర శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. గుండెపోటు, పక్షవాతం వంటి అత్యవసర పరిస్థితుల సమయంలో మొదటి గంటలో తీసుకోవాల్సిన ఫస్ట్ ఎయిడ్ మరియు బేసిక్ లైఫ్ సపోర్ట్ అంశాలపై అవగాహన కల్పిస్తోంది. గుంటూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల లక్షలాది మంది ఈ శిక్షణల ద్వారా ప్రాణాలను రక్షించుకునే అవకాశం పొందుతున్నారు.
ఈ క్రమంలో, ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్, గుంటూరు ప్రాంగణంలో ఉచిత మెగా సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరాన్ని నిర్వహించబోతోంది. ఈ శిబిరం జనవరి 5వ తేదీ, ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించబడుతుంది. ఈ శిబిరంలో గుండె, మెదడు, నరాలు, పక్షవాతం, జీర్ణకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, కిడ్నీ సంబంధిత వ్యాధులు, ఎముకలు, కీళ్ల వ్యాధులు, జ్వరాలు, సంక్రమణ వ్యాధులు, చిన్నపిల్లల వ్యాధులు, స్త్రీ మరియు ప్రసూతి వ్యాధులు, ఫెర్టిలిటీ సమస్యలు, షుగర్, థైరాయిడ్, రక్తపోటు వంటి సమస్యలపై నిష్ణాతులైన సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులు సేవలు అందిస్తారు.
హాస్పిటల్స్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్. పోతినేని రమేష్ బాబు ఆధ్వర్యంలో అగ్రశ్రేణి వైద్య నిపుణులు ఈ శిబిరంలో పాల్గొంటారని,ఈ శిబిరంలో బీపీ, బి.ఎం.ఐ, షుగర్, ఈసీజీ, గుండె స్కానింగ్, ఊపిరితిత్తుల సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తారని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మేనేజ్మెంట్ తెలియచేసింది. వైద్య శిబిరంలో పాల్గొనదలచిన వారు ముందస్తుగా అపాయింట్మెంట్ తీసుకోవాలని, అలాగే పాత వైద్య పరీక్షల రిపోర్టులను వెంట తీసుకురావాలని సూచించారు.
ముందుగా అపాయింట్మెంట్ మరియు వివరాల కోసం
0863-2377777 నంబర్‌లో సంప్రదించవచ్చు.
Prajavartha Online Telugu News