-ఎమ్మెల్యే సుజనా చౌదరి
-ఎంపీ కేశినేని శివ నాథ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తున్నామని ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఎంపీ కేశినేని శివనాద్ (చిన్ని) అన్నారు. కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొత్తపేట లోని కె బిఎన్ కళాశాల ఆవరణలో ఆదివారం ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథులుగా పాల్గొని మెడికల్ క్యాంపు ను ప్రారంభించారు.
ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు . ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనె సంకల్పంతో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు. నిరుపేద రోగులకు వైద్య ఖర్చుల భారం పడకుండా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందజేస్తున్న ఎంపీ కేశినేని శివనాథ్ ను గో వ్యాస్కులర్ హాస్పిటల్ వారిని అభినందించారు. అన్ని ప్రాంతాల్లో ఉచిత మెగా మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని ఎంపీ కేసినేని శివనాథ్ ను ఎమ్మెల్యే సుజనా కోరారు.
ఉచిత మెడికల్ క్యాంపులను సద్వినియోగం చేసుకోండి… : ఎంపీ కేశినేని శివనాధ్
ప్రజలందరూ ఉచిత మెడికల్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ కేశినేని శివనాద్ చిన్ని కోరారు. కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రో హాస్పిటల్ వారి సౌజన్యంతో పేదలందరికీ ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. విజయవాడలోని పలు ప్రాంతాల్లో వెరికోస్ వెయిన్స్ సమస్యతో ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ క్యాంపులో వెరికోస్ వెయిన్స్ సమస్యపై నిపుణులైన వైద్యులు సేవలందిస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే సుజనా చౌదరి తో కలిసి సమిష్టిగా సేవలను అందిస్తామన్నారు. కార్యక్రమానికి సహకరించిన ఎన్టీఆర్ ట్రస్ట్, గో హాస్పిటల్స్, కేబియన్ కళాశాల వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఉదయం 9 గం.ల నుంచి సాయంత్రం 5గం.ల జరిగిన ఈ వైద్య శిబిరంలో రక్తపోటు, షుగర్, థైరాయిడ్, గర్భాశయ సమస్యలు, ఆర్థోపెడిక్, మానసిక సమస్యలకు నిపుణులైన వైద్యులు చికిత్సలను అందించి అవసరమైన వారికి ఉచిత మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ అసిస్టెంట్ సర్జన్ ఎన్టీఆర్ ట్రస్ట్ డాక్టర్ బండ్లమూడి బసవేశ్వర రావు చౌదరి, ఎండో వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ సంపత్ వాదిత్య, డాక్టర్ సువర్ణ కుమారి ఎండి జనరల్, శంకర హాస్పిటల్ నేత్ర వైద్య బృందం కూటమి నేతలు నాగుల్ మీరా, ఎమ్మెస్ బేగ్, కొత్తపల్లి సుబ్బారాయుడు, ఉమ్మడి వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News