Breaking News

స్వాతంత్ర్య పోరాటంలో వడ్డే ఓబన్న వీరోచిత పోరాటం వెలకట్టలేనిది….

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్వాతంత్ర్య పోరాటంలో వడ్డే ఓబన్న వీరోచిత పోరాటం వెలకట్టలేనిదని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  అన్నారు. శనివారం నగరాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి నగర కమిషనర్ ఎంఎల్సీ చంద్రగిరి ఏసురత్నం, అధికారులతో కలిసి పూలమాల వేసి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన స్వాతంత్ర్య పోరాటంలో ఆయన సైన్యాధ్యక్షునిగా ఓబన్న వీరోచిత పోరాటం చేశారన్నారు. అటువంటి పోరాట యోధుని జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.
ఎంఎల్సీ మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటంలో నల్లమల అడవుల్లో జరిగిన కుంఫనీ వ్యతిరేక పోరాటంలో సైన్యాధ్యక్షునిగా ముందుండి సైన్యాన్ని నడిపిన ఓబన్న పోరాట చరిత్ర నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు.
కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు డి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, సిఎంఓహెచ్ డాక్టర్ అమృత, ఎంహెచ్ఓ డాక్టర్ రవిబాబు, బయాలజిస్ట్ మధుసూదన్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఉత్తరాంధ్రకు మకుటాయమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: మంత్రి కందుల దుర్గేష్

-ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవం.. ఈ సందర్భంగా ఏర్పాట్లను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *