-డి ఆర్వో టి సీతారామ మూర్తి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా, ఇతర వేదికల ద్వారా ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను జవాబుదారీతనం ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రెవిన్యూ అధికారి టి సీతారామ మూర్తి పేర్కొన్నారు.
సోమవారం జిల్లా కలెక్టరేట్ లో ప్రజల నుంచి జిల్లా స్థాయి అధికారులతో కలిసి అర్జీలను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా రెవిన్యూ అధికారి టి సీతారామ మూర్తి మాట్లాడుతూ, ప్రజా సమస్యలు పరిష్కారం కోసం అర్జీ దారులు ఇచ్చే ఫిర్యాదులు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి సమగ్ర నివేదిక ఆధారంగా పరిష్కారం చేయాలన్నారు. వాటిని తప్పని సరిగా ఫిర్యాదు దారుడు సంతృప్తి చెందేలా చూడాలన్నారు. నేడు పిజి ఆర్ ఎస్ లో 100 అర్జీలు స్వీకరించగా ఆన్లైన్ 96 , ఆఫ్ లైన్ లో 4 అర్జీలను నమోదు చేసి నట్లు తెలిపారు . అర్జీ పరిష్కారం కోసం క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించి, వాటికి చెందిన ఫోటోలు అప్లోడ్ చెయ్యాలని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో పరిష్కారం చెసే వాటికీ చెందిన అర్జీ దారులను కార్యాలయానికి పిలిపించి ఫోటోలు తీసుకోరాదని, క్షేత్ర స్థాయి సిబ్బందిని ఆమేరకు ఆదేశాలు పాటించడం పై దిశా నిర్దేశనం చెయ్యాలని పేర్కొన్నారు. రెవిన్యూ 49, పోలీస్ 20, పంచాయతీ రాజ్ 10, వ్యవసాయ, సహకార రంగం 5, ఇతర శాఖలు 16 అర్జీలు స్వీకరించడం జరిగింది.
సోమవారం స్వీకరించిన కొన్ని అర్జీలు:…
గణేష్ చౌక్ రైతు బజారులో బినామీ రైతు పంతగాని సతీష్, తదితరులు పై ఒకే కులం, వారు ఒకే వర్గం వారు 22 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తూ దోపిడీ చేస్తున్నారని, తగిన విధంగా చర్యలు తీసుకోవాలని భేతాల నాగేశ్వర రావు అర్జీ ఇవ్వడం జరిగింది
హుకుంపేట కి చెందిన భీమాన రాంబాబు తన అర్జిలో రహదారి కృంగి పోయిందని, డ్రైనేజీ వ్యవస్థ బాగాలేదని అర్జీ ఇవ్వడం జరిగింది.
పిడీంగొయ్యి బుచ్చియ్య నగర్ కి చెందిన మంతిన జోగారావు 85 శాతం దివ్యాంగత్వం కలిగి ఉన్నానని, పెన్షన్ మంజూరు చేయాలని కోరడం జరిగింది.
రంగంపేట మండలం వడిశలేరు గ్రామానికీ ఉప్పలపాటి బుల్లిదొర … సర్వే నెంబర్ 717/2 లో 90 సెంట్ల భూమి రీ సర్వే చేపట్టాలని కోరడం జరిగింది
వేమగిరి కి చెందిన చలపతి రోహిణి (భర్త సూరిబాబు) యూనియన్ బ్యాంక్ లో చెల్లించిన బీమా పరిహారం చెల్లించలేదని అర్జీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిపివో ఎల్. అప్పలకొండ, డిఎల్డివో డి. స్లివ రెడ్డీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News